ETV Bharat / sitara

షూటింగ్​లకు కేంద్రం అనుమతి.. కానీ ఇవి తప్పనిసరి

author img

By

Published : Aug 23, 2020, 2:22 PM IST

Updated : Aug 23, 2020, 2:41 PM IST

కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్​లను తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతిచ్చింది కేంద్ర ప్రభుత్వం. నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం, మాస్కులు ధరించి షూటింగ్స్​ జరుపుకోవచ్చని తెలిపింది.

షూటింగ్​లకు ఇవి తప్పనిసరి పాటించాల్సిందే!

అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాల్లో భాగంగా సినిమాలు, టీవీ కార్యక్రమాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా షూటింగ్​లు జరుపుకోవచ్చని తెలిపింది. తాజాగా కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.

కేంద్ర మార్గదర్శకాలు

  • బహిరంగ ప్రదేశాల్లో యూనిట్‌ సిబ్బంది మొత్తం ఫేస్‌ మాస్క్‌లు తప్పనిసరిగా ఉపయోగించాలి.
  • ఆరోగ్య సేతు యాప్‌ను నటీనటులంతా ఉపయోగించాలి.
  • షూటింగ్‌ సమయాల్లో విజిటర్లను అనుమతించవద్దు.
  • మేకప్‌ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి.
  • సాధ్యమైనంత తక్కువ మంది సిబ్బందితో చిత్రీకరణ జరిపేలా చూడాలి.
  • థియేటర్లలో సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలి.
  • టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించాలి.
  • షూటింగ్‌ పాయింట్‌ వద్ద సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా చేయాలి.
  • చిత్రీకరణ జరిపే ప్రాంతంలో తాత్కాలిక ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి.
  • వయసు పైబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి.
  • కామన్ లొకేషన్స్ అయిన సెట్స్​, కాఫ్టేరియా, మేకప్ రూమ్స్, ఎడిట్ రూమ్స్, కేరవ్యాన్స్, వాష్​రూమ్స్ తరచూ శానిటైజ్ చేయాలి.
  • నటులు ఇంటివద్దే ప్రాక్టీస్ చేసేటట్లు చూసుకోవాలి

Last Updated : Aug 23, 2020, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.