ETV Bharat / sitara

ఈ సెలబ్రిటీలు వాడే స్పోర్ట్స్ బైక్స్ ధరెంతో తెలుసా? - madhavan bike collection

బైక్​ యాక్సిడెంట్​ జరిగి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు హీరో సాయిధరమ్​ తేజ్(Sai dharam tej road accident))​. ఈ నేపథ్యంలో ఆయన నడిపిన స్పోర్ట్స్​ బైక్​ గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అయితే ఈయన దగ్గర ఉన్న ఖరీదైన స్పోర్ట్స్​ బైక్ లాంటివే పలువురు సెలబ్రిటీల దగ్గర ఉన్నాయి. వారెవరు, వాటి ధర ఎంతంటే?

celebrity
సెలబ్రిటీ
author img

By

Published : Sep 12, 2021, 12:36 PM IST

హీరో సాయిధరమ్​ తేజ్(Sai dharam tej road accident)​.. రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేబుల్​ బ్రిడ్జ్​పై వెళ్తున్న సమయంలో బండి అదుపు తప్పి పడిపోవడం వల్ల తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తేజ్​కు ఇలా జరగడంపై పలువురు అభిమానులు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు ప్రమాదం జరిగేటప్పుడు ఆయన నడిపిన స్పోర్ట్స్​ బైక్​(ట్రంప్​)పైనా చర్చించుకుంటున్నారు. అయితే తేజ్​ దగ్గరే కాదు పలువురు సినీ సెలబ్రిటీల గ్యారేజీలలో ఎంతో ఖరీదైన హై స్పీడ్​ సూపర్ డూపర్​ మోటర్​ బైక్స్ ఉన్నాయి. వాటి విలువ దాదాపు రూ.10లక్షలకు పైగానే ఉన్నాయి. ఇంతకీ అవి ఎవరెవరి దగ్గర ఉన్నాయంటే..

సాయిధరమ్ తేజ్​

సాయితేజ్​కు ప్రమాదం జరగగానే ఆయన బైక్​ ఏంటని ఆరా తీయడం ప్రారంభించారు నెటిజన్లు. తేజ్ గ్యారేజీలో ఉన్న చాలా బైక్స్​లో.. ప్రమాదం జరిగినప్పుడు ఆయన నడిపిన ట్రంప్​ బండి కూడా ఒకటి. 660సీసీతో నడిచే ఈ బైక్​ విలువ దాదాపు రూ.11 నుంచి రూ.18లక్షల మధ్య ఉంటుంది. తేజ్​కు బైక్​ రైడింగ్​ అంటే ఇష్టమని వినికిడి.

saidharam tej
సాయిధరమ్​ తేజ్​

షాహిద్​ కపూర్​

బాలీవుడ్​ హీరో షాహిద్​ కపూర్ బైక్​ లవర్​. ఖాళీ దొరికినప్పుడు లాంగ్​ రైడ్​కు వెళ్తుంటారు. ఆయన గ్యారేజీలో ఎన్నో రకాల ఖరీదైన వాహనాలు ఉంటాయి. అందులో దాదాపు రూ.18లక్షల వరకు విలువ చేసే ఎన్నో బీఎమ్​డబ్ల్యూ మోడల్స్​, డుకాటి స్క్రామ్​బ్లర్ 1100(రూ.11లక్షలు) ఉన్నాయి. ​

shahid
షాహిద్​ కపూర్​

సల్మాన్​ ఖాన్​

సల్మాన్​ ఖాన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన కూడా బైక్​రైడర్​. భాయ్​ దగ్గర సుజుకి హయాబుసా, యమహా వైజడ్​ఎఫ్​-ఆర్​1, సుజుకి జీఎస్​ఎక్స్​-ఆర్​ 1000జెడ్​ సహా ఇంకెన్నో టాప్​ బ్రాండ్స్​ బైక్స్​ ఉన్నాయి. ఇందులో సుజుకి ఇంట్రడర్​ ఎమ్​ 1800ఆర్​జెడ్​ కూడా ఒకటి. దీని విలువ రూ.16లక్షలు.

salmankhan
సల్మాన్​

మాధవన్​

బహుభాషా నటుడు మాధవన్​ ఏకంగా రూ.40-46లక్షలు విలువ చేసి ఇండియన్​ రోడ్​ మాస్టర్​ను తన సొంతం చేసుకున్నాడు. దీంతో పాటే ఆయన గ్యారేజీలో బీఎమ్​డబ్ల్యూ కే1600జీటీఎల్​ కూడా ఉంది. ఆరు సిలిండర్లతో కూడిన 1649సీసీ దీని ఇంజన్​ సామర్థ్యం. రూ.28.75లక్షలు దీని విలువ.

madhavan
మాధవన్​

జాన్​ అబ్రహాం

జాన్​ అబ్రహం కూడా బైక్​ లవర్​. రేసింగ్​లకు వెళ్తుంటారు! ఆయన దగ్గర బీఎమ్​డబ్ల్యూ ఎస్​1000 ఆర్​ఆర్​ ఉంది. దీని ఎక్స్​ షోరూమ్​ విలువ రూ.18.5లక్షలు. దీంతో పాటే హోండా సీబీఆర్​1000ఆర్​ఆర్​-ఆర్​ ఫైర్​బ్లేడ్​, అప్రిలియా ఆర్​ఎస్​వీ4 ఆర్​ఎఫ్​, యమహా వైజడ్​ఎఫ్​ ఆర్​1, ఎమ్​వీ అగస్ట ఎఫ్​3 800, డుకాటి పనిగలె వీ4, యమహా వీమ్యాక్స్​, కవాసకీ నింజా జడ్​ఎక్స్​-14ఆర్​ కూడా ఆయన గ్యారేజీలో ఉన్నాయి.

ఇదీ చూడండి: సాయిధరమ్​ తేజ్​ హెల్త్ ​బులెటిన్​ విడుదల​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.