రియా సహా ఆరుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రియా చక్రవర్తితో పాటు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్య చక్రవర్తి, షౌహిక్ చక్రవర్తి, సామ్యూల్ మిరండా, శ్రుతి మోదీ తదితరులపై కేసు నమోదు చేసింది సీబీఐ.
ఇప్పటికే ఈ కేసు విషయమై బాలీవుడ్లో వివాదం నెలకొంది. సుశాంత్ ఆత్మహత్యకు కారణం రియానే అంటూ అతడి తండ్రి కేక సింగ్ బిహార్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే కేంద్రం కూడా ఆమోదం తెలపడం వల్ల ఈ కేసు విషయంలో వేగం పెంచింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ క్రమంలో రియాతో సహా ఆరుగురిపై కేసు నమోదు చేసింది.