*బర్నింగ్‌స్టార్ సంపూర్ణేశ్‌బాబు 'క్యాలీఫ్లవర్' సినిమా కొత్త పోస్టర్ వచ్చేసింది. ఇందులో బట్టల్లేకుండా కేవలం క్యాలీఫ్లవర్ మాత్రమే పట్టుకొని ఉన్న సంపూ.. నెటిజన్లను షాక్‌కు గురిచేశాడు. 'శాసనసభ ఎదుట, క్యాలీఫ్లవర్ సాక్షి గా, శీలో రక్షతి రక్షితః' అంటూ ఫొటోకు క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.
*క్రికెటర్ హర్భజన్ నటిస్తున్న 'ఫ్రెండ్షిప్' సినిమాలోని పాట రిలీజైంది. 'అరిచి అరగదీయమ్మా' అంటూ సాగుతున్న గీతం.. చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది. తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సూపర్‌హిట్ 'మాస్టర్‌పీస్' సినిమా తెలుగులోనూ రానుంది. 'గ్రేట్ శంకర్' టైటిల్‌తో దీనిని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం టీజర్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్ పోలీస్‌గా నటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*పునర్నవి భూపాలం, హాస్యనటుడు నవీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఒక చిన్న విరామం'. ఆహా ఓటీటీ వేదికగా జులై 9న విడుదల కానుంది.
ఇవీ చదవండి: