హీరోయిన్ కేథరిన్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఒకేసారి ఇద్దరు నందమూరి హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుందట. అందులో బాలకృష్ణ సినిమా ఒకటి.. కల్యాణ్‌రామ్ చిత్రం మరొకటి. వీటిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందట.
నందమూరి బాలకృష్ణ 'రూలర్'.. ప్రేక్షకుల ముందుకొచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తర్వాతి సినిమా చేయనున్నాడు. జనవరి నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఇందులో కేథరిన్ కథానాయికగా కనిపించనుంది. శ్రీకాంత్ విలన్‌గా నటించనున్నాడట.
హీరో కల్యాణ్‌రామ్.. 'ఎంత మంచివాడవురా' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వేణు మల్లాడి అనే కొత్త దర్శకుడుతో కలిసి పనిచేయనున్నాడు. ఇందులో కేథరిన్‌ను హీరోయిన్గా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకు సంబంధించిన ప్రకటన త్వరలో రానుందట.
ఇది చదవండి: రొమాన్స్‌కి కేథరిన్.. పోరుకి శ్రీకాంత్..!