ETV Bharat / sitara

'అల వైకుంఠపురములో' రికార్డులకు బ్రేక్ పడట్లేదుగా! - Buttabomma song

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ యూట్యూబ్​లో దుమ్ములేపుతున్నాయి. తాజాగా ఇందులోని 'బుట్టబుమ్మా' సాంగ్ ఓ రికార్డును సృష్టించింది.

అల్లు
అల్లు
author img

By

Published : Apr 4, 2020, 7:00 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాలోని 'బుట్టబొమ్మా..బుట్టబొమ్మా' అంటూ సాగే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం జనవరిలో విడుదలైనా ఈ పాట మాత్రం ఇప్పటికీ దమ్ములేపుతోంది.

Buttabomma
బుట్టబొమ్మా సాంగ్

తాజాగా 'బుట్టబొమ్మా' పూర్తి నిడివి పాటని యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ పాట 100 మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకుంది. అంటే దాదాపు పదికోట్ల మంది ఈ పాటను చూశారన్న మాట. అంతేకాదు పాటకు పదిలక్షల లైక్‌లు కూడా లభించాయి. ఈ పాటకు సాహిత్యం, తమన్‌ సంగీతంతో పాటు కొరియాగ్రఫీ కూడా అన్నీ అద్దినట్టు కుదిరాయని అందుకే 'బుట్టబొమ్మా' ఇంతలా ఆకట్టుకుంటోందని పలువురు అభిప్రాయ పడతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.