ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన 'బుట్టబొమ్మ' పాట(అల వైకుంఠపురములో సినిమా) మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఎక్కువసార్లు చూసిన తొలి తెలుగు గీతంగా నిలిచింది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీని తర్వాతి స్థానంలో 'వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే'(ఫిదా) సాంగ్ ఉంది.
అయితే బుట్టబొమ్మ ఆడియో విడుదల చేసినప్పటి నుంచి శ్రోతల మనసు గెల్చుకుంటూనే ఉందీ గీతం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. ఈ పాటకు టిక్‌టాక్ చేసిన వారిలో ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, సీనియర్ నటి సిమ్రాన్‌తో పాటు పలువురు తారలు ఉండటం విశేషం.
ఈ గీతంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే వేసిన స్టెప్పులు తెగ ఆకట్టుకున్నాయి. అందుకే పాటను మళ్లీ మళ్లీ చూసేలా చేశాయి. అయితే ఈ సాంగ్ విషయంలో జరిగిన ఆసక్తికర సంఘటనను గతంలో ఓసారి చెప్పారు సంగీత దర్శకుడు తమన్.
"తొలుత ఈ పాట స్థానంలో వేరొకటి అనుకున్నాం. కానీ అది బన్నీకి నచ్చలేదు. దీంతో కేవలం మూడురోజుల్లోనే 'బుట్టబొమ్మ'ను కంపోజ్ చేశాను. ఆ తర్వాత యూట్యూబ్‌లో రచ్చ అంతా మీకు తెలిసిందే" అని తమన్ చెప్పుకొచ్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: