అశ్లీల చిత్రాల కేసులో రెండు నెలలక్రితం అరెస్టయిన వ్యాపారి రాజ్ కుంద్రా(Raj Kundra Case) జైలు నుంచి బయటకు వచ్చాడు. మంగళవారం ఉదయం 11:30 నిమిషాలకు ఆయన్ను విడుదల చేశారు జైలు అధికారులు. రూ.50వేల పూచీకత్తుతో ముంబయి న్యాయస్థానం మేజిస్ట్రేట్ ఎస్బీ భాజిపాలే.. సోమవారం అతడికి బెయిల్ మంజూరు చేశారు. కుంద్రాతోపాటు మరో నిందితుడు రయన్ తోర్పేకూ ముంబయి కోర్టు బెయిల్ ఇచ్చింది.
శిల్పాశెట్టి ఏమన్నారంటే..?
రాజ్‌కుంద్రాకు(Raj Kundra Case) బెయిల్ మంజూరు కావటంపై ఆయన సతీమణి శిల్పాశెట్టి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించింది. చేదు జ్ఞాపకాల తర్వాత మంచి రోజులు వచ్చాయని పేర్కొంది. గాలివాన తర్వాత.. ఇంద్రధనుస్సు వెల్లువిరిస్తుందని తెలిపింది.
రాజ్ కుంద్రా ఫోన్లో 119 నీలిచిత్రాలు..
విచారణలో భాగంగా రాజ్‌కుంద్రా ఫోన్, ల్యాప్‌టాప్, హార్డ్ డిస్క్‌లను పరిశీలించామని.. వాటిల్లో మొత్తం 119 నీలిచిత్రాలు గుర్తించామని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఆ వీడియోలన్నింటినీ కుంద్రా రూ.9 కోట్లకు బేరం పెట్టినట్లు తెలిపారు.
ఏం జరిగింది..?
అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో ముంబయి పోలీసులు జులై 19న రాజ్‌కుంద్రాను(Rajkundra net worth) అరెస్ట్ చేశారు. పోర్న్ చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో గత ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి దీనిపై దర్యాప్తు సాగిస్తున్న అధికారులు.. సాక్ష్యాలను సేకరించి కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే కుంద్రాపై(Raj Kundra Case) ఇటీవలే 1,400 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు అధికారులు. మరోవైపు కుంద్రా కూడా కోర్టులో బెయిల్(Raj kundra bail high court) కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది.
ఇవీ చదవండి:
Raj Kundra: 'అతడు తప్పుడు పనులు చేయిస్తాడనుకోలేదు'