ETV Bharat / sitara

అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త అరెస్ట్​ - shilpa shetty husband

నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారి రాజ్‌కుంద్రాను(Raj Kundra) ముంబయి పోలీసులు అరెస్ట్​ చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి.. పలు యాప్‌ల ద్వారా విడుదల చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

Raj Kundra
రాజ్ కుంద్రా
author img

By

Published : Jul 20, 2021, 12:14 AM IST

Updated : Jul 20, 2021, 11:44 AM IST

అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను(Raj Kundra) ముంబయి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్​ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారని తెలిసి గత ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్‌కుంద్రా కనిపిస్తున్నారని ముంబయి పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని రాజ్‌కుంద్రా పేర్కొన్నారు. అనంతరం ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారు.

Raj Kundra arrested
భర్త రాజ్ కుంద్రాతో శిల్పాశెట్టి

రాజ్‌ కుంద్రా 2009లో శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నారు. 2012లో వారికి వియాన్‌ జన్మించాడు. గతేడాది వారు సరోగసి ద్వారా సమిష అనే పాపకు జన్మనిచ్చారు. జేఎల్‌ స్ట్రీమ్‌ యాప్‌ యజమాని అయిన రాజ్‌ కుంద్రా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టీం రాజస్థాన్‌ రాయల్స్‌కు సహ యజమానిగా ఉన్నారు. 2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్‌ బెట్టింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో దిల్లీ పోలీసులు రాజ్‌ కుంద్రాను ప్రశ్నించారు.

Raj Kundra
భర్త రాజ్ కుంద్రాతో శిల్పాశెట్టి

ఇదీ చదవండి: కార్తి పక్కనే ఉన్నా గుర్తుపట్టని విజయ్​!

Last Updated : Jul 20, 2021, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.