ETV Bharat / sitara

'లక్ష్మీబాంబ్'​ బాయ్​కాట్​ చేస్తామంటోన్న సుశాంత్​ అభిమానులు - అక్షయ్​కుమార్​ లక్ష్మీబాంబ్​

బాలీవుడ్ హీరో అక్షయ్​కుమార్​ నటించిన 'లక్ష్మీబాంబ్​' సినిమాను బాయ్​కాట్​ చేస్తామని సుశాంత్​ అభిమానులు సోషల్​మీడియాలో ట్రోల్​ చేస్తున్నారు. నటుడి మృతి కేసులో న్యాయం జరగాలని అక్షయ్​ ఎన్నడూ మాట్లాడకపోవడమే కారణమని తెలిపారు.

laxmi bomb
లక్ష్మీబాంబ్​
author img

By

Published : Oct 10, 2020, 8:41 AM IST

బాలీవుడ్​ స్టార్ హీరో అక్షయ్​కుమార్​ నటించిన 'లక్ష్మీబాంబ్'​ ట్రైలర్​ ఇటీవల విడుదలై సినీప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని బాయ్​కాట్​ చేస్తామని సోషల్​మీడియాలో నిరసన తెలుపుతున్నారు సుశాంత్​ అభిమానులు. నటుడి మృతి కేసులో న్యాయం జరగాలని తాము చేస్తోన్న పోరాటానికి అక్షయ్​ మద్దతు తెలపకపోవడమే కారణమని తెలిపారు. దీంతోపాటు అతడిని నకిలీ జాతీయవాది అని అభివర్ణించారు.

'లక్ష్మీ బాంబ్'.. హారర్, కామెడీ కథతో తీసిన ఈ సినిమా నవంబరు 9 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ కానుంది. అక్షయ్, ఇందులో ట్రాన్స్ జెండర్​ పాత్రలో కనిపించనున్నారు. దక్షిణాది చిత్రం 'కాంచన'కు ఇది రీమేక్. కియారా అడ్వాణీ హీరోయిన్. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ పతాకంపై తుషార్ కపూర్, అశ్విన్ కల్సేకర్, శరద్ కేల్కర్ సంయుక్తంగా నిర్మించారు.

ఇదీ చూడండి బాక్సాఫీస్ విక్రమార్కుడు.. ఈ దర్శక ధీరుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.