ETV Bharat / sitara

బోనీ కపూర్ ఇంట్లో సహాయకుడికి కరోనా

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ ఇంట్లో సహాయకుడైన యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ముంబయి మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు తెలిపారు. ఇదే వార్తపై బోనీ కపూర్‌ స్పందించారు.

బోనీ
బోనీ
author img

By

Published : May 19, 2020, 8:10 PM IST

Updated : May 19, 2020, 8:35 PM IST

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో సహాయకుడైన ఓ యువకుడికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు వెల్లడించారు. దీనిపై బోనీ కపూర్ కూడా స్పందించారు.

"నేను నా పిల్లలందరం బాగానే ఉన్నాం. మాలో ఎటువంటి లక్షణాలు లేవు. ఆరోగ్యంగానే ఉన్నాం. లాక్‌డౌన్ ప్రారంభమైన నాటి నుంచి మా ఇంటిని విడిచి వెళ్లలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలను తప్పక పాటిస్తున్నాం. గత శనివారం నుంచి మా ఇంట్లో పనిచేసే చరణ్ సాహుకు కొంత నలతగా ఉంది. దాంతో మేమే అతడ్ని పరీక్ష కోసం పంపాం. త్వరలోనే అతను కోలుకొని ఇంటికి వస్తాడని ఆశిస్తున్నాం"

-బోనీ కపూర్, నిర్మాత

ముంబయి, అంధేరిలోని గ్రీన్‌ ఎకర్స్ సముదాయంలో కూతుళ్లు జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్​తో కలిసి నివసిస్తున్నారు బోనీ కపూర్.

Last Updated : May 19, 2020, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.