ETV Bharat / sitara

అలాంటి విషయాల్నే కథలుగా తీశా: బొమ్మరిల్లు భాస్కర్

author img

By

Published : Oct 17, 2021, 7:21 AM IST

తాను ఇన్నేళ్ల కెరీర్​లో చాలా తక్కువే సినిమాలు చేయడానికి గల కారణం చెప్పారు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. జీవితంలో ఫీలైన విషయాల్నే కథలుగా చెబుతానని అన్నారు.

bommarillu bhaskar interview
బొమ్మరిల్లు భాస్కర్

"నా సినిమా సినిమాకు గ్యాప్‌ వస్తుందని, వెనకబడి పోతున్నానని నేనెప్పుడూ టెన్షన్‌ పడను. నేను తీసే సినిమాతో ప్రేక్షకులకు ఎంత మంచి విషయం చెబుతున్నానన్నదే నాకు ముఖ్యం" అని అన్నారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌. ఇప్పుడాయన డైరెక్షన్​లో అఖిల్‌ హీరోగా నటించిన చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'. బన్నీవాసు, వాసు వర్మ నిర్మించారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు భాస్కర్‌. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

"ప్రతి పెళ్లి వేడుకలా జరుగుతుంది. అయితే పెళ్లి తర్వాత ఎలా బతకాలి అన్న విషయంలో ఎవరికీ స్పష్టత ఉండదు. అసలు వివాహం తర్వాత కాపురం సాఫీగా సాగడానికి కావాల్సిన అర్హతలేంటి? అన్నది మనకు తెలియదు. ఈ అంశాన్ని ఓ ఆసక్తికర కథనంగా చెప్పాలి.. అదీ సున్నితమైన వినోదంతో ఆకట్టుకునేలా చూపించాలి అన్న ఉద్దేశంతో 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చేశాం. మనలో ఉన్న ఓ ఎమోషన్‌ను మనసులో ఉన్న ఓ వ్యక్తికి చెప్పాలనుకున్నప్పుడు.. ఆ టైమ్‌కు వాళ్లు రాకపోతే కలిగే బాధని వర్ణించలేము. ఆ బాధ ఎలా ఉంటుందనేది దీంట్లో ఆసక్తికరంగా చూపించాం. దీనికి అఖిల్‌, పూజా హెగ్డే తమదైన నటనతో ప్రాణం పోశారు".

akhil pooja hegde
అఖిల్, పూజాహెగ్డే

* "బొమ్మరిల్లు' నుంచి ఇప్పుడీ చిత్రం వరకు నా సినిమాలన్నింటిలో నేనెక్కడో ఫీలైన విషయాల్నే కథగా చెప్పే ప్రయత్నం చేశా. నేను ఇన్నేళ్లలో కొన్నే చిత్రాలు చేయడానికి ఓ కారణముంది. నేనేదైనా విషయాన్ని తీసుకుంటే.. దాని గురించి పరిపూర్ణంగా ఆలోచించడానికే ఎక్కువ టైం పట్టేది. 'ఒంగోలు గిత్త' తర్వాత తమిళం, తెలుగు భాషల్లో ఓ మల్టీస్టారర్‌ చేద్దామనుకున్నా. ఇందుకు ముగ్గురు పెద్ద హీరోలు, నలుగురు నాయికల్ని అనుకున్నా. వారి డేట్స్‌ సర్దుబాటు కాక ఆ చిత్రం ఆగిపోయింది. ప్రస్తుతం నా దగ్గర ఇంకొన్ని కథలున్నాయి. అవి ఎవరితో చేస్తానన్నది త్వరలో తెలియజేస్తా".

ఇది చదవండి: నాకు ఒక్క ప్రేమలేఖా రాలేదు: పూజాహెగ్డే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.