కోట్లల్లో రెమ్యూనరేషన్, లెక్కలేనంత మంది అభిమానులు, చేతినిండా సినిమాలు.. ఇది బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుత జీవితం. కానీ ఓ అమ్మాయి ముద్దడిగితే, అక్షయ్ భయపడి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. టికెట్ లేకుండా రైలులోనూ ప్రయాణం కూడా చేశారు. ఈ విషయాన్ని గతంలో కపిల్‌శర్మ కామెడీ షోకు హాజరైనప్పుడు వెల్లడించారు.
చిన్నప్పుడు స్నేహితులతో కలిసి మహారాష్ట్రలోని మాథెరన్ హిల్స్టేషన్కు వెళ్లిన అక్షయ్.. తిరిగి వచ్చేందుకు మిగల్లేదు. చివరకు ఏమైతే అది అయిందని ఏడుగురు ఫ్రెండ్స్ కలిసి ఒకే టికెట్ కొని రైలు ప్రయాణం చేశారు. అదృష్టం ఏంటంటే టీసీ వీళ్లని పట్టించుకోలేదు.
టీన్జ్లో ఉన్నప్పుడు అక్షయ్, ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే కాదని పొమ్మందట. ఇండస్ట్రీలోకి రాకముందు ఈ హీరోకు సిగ్గు చాలా ఎక్కువగా ఉండేది. స్నేహితురాలితో బయటకు వెళ్లినప్పుడు చేతులు పట్టుకుని ముద్దు పెట్టమని అడిగేదని, కాని సిగ్గుతో పారిపోయేవాడినని వెల్లడించారు అక్షయ్. 'నువ్వు వద్దు, నీ ముద్దు వద్దు' అని చివరకు ఆమె వెళ్లిపోయిందట.