ETV Bharat / sitara

Bollywood: సంపాదన కోట్లలో.. ఉండేది అద్దె ఇంట్లో! - cinema celebrities rented homes

స్టార్​ నటులు తమ అభిరుచులు తగ్గట్లుగా సొంత ఇళ్లను నిర్మించుకుంటారు. అందులో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ కొంతమంది ప్రముఖ నటులు మాత్రం కోట్లు సంపాదిస్తున్నప్పటికీ అద్దె ఇళ్లలోనే నివసించేందుకు ఇష్టపడుతున్నారు. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరు? ఎక్కడ ఉంటున్నారు?

rented house
అద్దె ఇంట్లోనే
author img

By

Published : Jun 20, 2021, 1:29 PM IST

సినిమా స్టార్స్ లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు వేసుకునే బట్టలు, తినే తిండి, ఉండే ఇళ్లు, తిరిగే కార్లు.. ప్రతీది హైక్లాస్​గానే ఉంటాయి! ప్రతి విషయంలోనూ ఏ మాత్రం రాజీపడకుండా తమ అభిరుచికి తగ్గట్లుగా ఉండేలా చూసుకుంటుంటారు.

నిత్యం సినిమాలు చేస్తూ కోట్లలో ఆర్జిస్తున్న ఈ నటీనటులకు.. వారి విలాసాలకు అయ్యే ఖర్చు పెద్ద విషయంఏమీ కాదు!. అయితే కొంతమంది నటులు మాత్రం భారీగా సంపాదిస్తున్నప్పటికీ ఇంకా అద్దె ఇళ్లలోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు. అందుకు వారు ఎక్కువగానే డబ్లులు చెల్లిస్తున్నారు. అలాంటి స్టార్స్ గురించే ఈ స్టోరీ.

రిచాచద్ధా-అలీ ఫజల్​(Richachaddha-Ali Fazal)

బాలీవుడ్ ప్రేమ జంట​ రిచాచద్ధా-అలీ ఫజల్. 'ఫక్రే' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. గతేడాది ఓ కొత్త అపార్ట్​మెంట్​లోకి షిఫ్ట్​ అయ్యారు. దీని అద్దె నెలకు రూ.3లక్షలు. ఈ మధ్య కాలంలో వెబ్​సిరీస్​ల్లో బోల్డ్​ పాత్రల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రిచా. ప్రస్తుతం 'అభి తో పార్టీ షురూ హుయి హై' సినిమాలో నటిస్తోంది. అలీ ఫజల్​.. ఇటీవల 'మీర్జాపూర్​ 2'తో అలరించాడు. త్వరలోనే 'డెత్​ ఆన్​ ది నైల్'​తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

richa
రిచాచద్ధా-అలీ ఫజల్​

సన్నీలియోనీ(SunnyLeone)

బాలీవుడ్​ ప్రముఖ నటి సన్నీలియోని కెరీర్​ ప్రారంభంలో, సహనటి సెలీనా జైట్లీ పెంట్​ హౌస్​లో తన భర్త డేనియల్​ వెబర్​తో కలిసి ఉండేదట. ఆ తర్వాత అత్యంత ఖరీదైన జుహు ప్రాంతంలోని స్పిల్ట్​విల్లాకు మారింది.

sunnyleone
సన్నీలియోని

కత్రినా కైఫ్​(Katrina Kaif)

బాలీవుడ్​ బార్బీ గర్ల్​ కత్రినా కైఫ్​ కొద్దికాలం క్రితం వరకు ఓ ప్లాట్​కు ఏకంగా రూ.15 లక్షలు అద్దె కట్టి ఉందని సమాచారం. ప్రస్తుతం ఆమె ముంబయి బాంద్రాలోని ఓ పెంట్​హౌస్​లో నివాసం ఉంటోంది. త్వరలోనే 'సూర్యవంశీ', 'ఫోన్​ భూత్'​, 'టైగర్​ 3' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

katrina
కత్రినా కైఫ్​

జాక్వలిన్​ ఫెర్నాండెజ్​(Jacquelin Fernandez)

బాలీవుడ్​ బ్యూటీ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​.. ఐదు బెడ్​రూమ్స్​ ఉన్న లగ్జరీ అపార్ట్​మెంట్​లో ఉంటోంది. ఇందుకోసం నెలకు.రూ.6.78 లక్షలు చెల్లిస్తోంది. ప్రస్తుతం ఆమె ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందని తెలిసింది. ఈ జంట లివ్​ ఇన్​లో ఉండేందుకు జుహూ ప్రాంతంలోని రూ.175 కోట్ల విలువైన అపార్ట్​మెంట్​ కొనుగోలు చేయనున్నారని సమాచారం.

జాక్వెలిన్​ వరుస సినిమాలతో బిజీగా ఉంది. 'సాహో'లో(Saaho) ప్రత్యేక గీతంలో తెలుగువారికి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. పవన్​కల్యాణ్(Pawankalyan)​ 'హరిహర వీరమల్లు'(Harihari veeramallu) సినిమాలో రాజకుమారిగా పూర్తిస్థాయి పాత్రలో నటిస్తోంది. వీటితో పాటు 'ఎటాక్'​, 'భూత్​పోలీస్'​, 'సర్కస్​', 'బచ్చన్​ పాండే', 'రామ్​సేతు' సినిమాల్లోనూ హీరోయిన్​గా చేస్తోంది.

jaquelin
జాక్వెలిన్​

హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan)

హృతిక్​ రోషన్​.. జుహూ ప్రాంతంలోని ఓ అపార్ట్​మెంట్​లో ఉంటున్నారు. దీని అద్దె నెలకు రూ.8.25లక్షలు. ఆయన ఇంటి పక్కన స్టార్​ హీరో అక్షయ్​కుమార్​, ట్వింకిల్​ ఖన్నా దంపతులు ఉంటారు. 2019లో చివరిసారిగా 'వార్​'​తో ప్రేక్షకులను పలకరించారు హృతిక్​.

hrithik
హృతిక్​ రోషన్​

నవాజుద్దీన్ సిద్దిఖీ(Nawazuddin Siddiqui)

గతంలో ఓ ఇంటర్వూలో పాల్గొన్న విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ.. తాను అద్దె ఇంట్లో ఉంటున్నాని వెల్లడించారు. రెంటెడ్​ అపార్ట్​మెంట్​లో ఉండటానికి తాను ఇష్టపడతానని చెప్పారు. త్వరలోనే ఆయన నటించిన 'జోగిరా సారా రా రా', 'సంగీన్'​, 'నో ల్యాండ్​ మ్యాన్' సినిమాలు విడుదల కానున్నాయి.

nawazuddin
నవాజుద్దీన్​

ఇదీ చూడండి: ఇమేజ్ పెరిగింది.. ట్యాగ్​ మారింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.