ETV Bharat / sitara

బాలీవుడ్​లో కార్తిక్​ ఆర్యన్​ భవితవ్యం ఏమిటి?

author img

By

Published : Jun 6, 2021, 2:34 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణానికి బాలీవుడ్​లో ఉన్న నెపోటిజమే కారణమని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు హీరో కార్తిక్​ ఆర్యన్​ విషయంలోనూ ఇదే కారణంగా మరోసారి హిందీ చిత్రసీమ చేదు అనుభవాన్ని ఎదుర్కొంటోంది. కార్తిక్​ ఆర్యన్​ను పలు చిత్రాల నుంచి తప్పించడమే అందుకు కారణమని తెలుస్తోంది.

Bollywood Celebrities about Kartik Aaryan
బాలీవుడ్​లో కార్తిక్​ ఆర్యన్​ భవితవ్యం ఏమిటి?

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా చెప్పుకునే బాలీవుడ్‌లో మరోసారి అవుట్‌ సైడర్స్‌ అనే మాట తెరపైకి వచ్చింది. ఇప్పటికే యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో నెపోటిజం (బంధుప్రీతి) విమర్శను ఎదుర్కొన్న బీటౌన్‌.. హీరో కార్తిక్‌ ఆర్యన్‌ కారణంగా ఇప్పుడు మరోసారి అదే చేదు అనుభవాన్ని చవిచూస్తోంది. బీటౌన్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న సినిమా నుంచి కార్తిక్‌ని తొలగించడమే ఇందుకు కారణం.

ఎలాంటి ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే స్టార్‌ స్టేటస్‌ దక్కించుకుంటున్న ఆయనను నిర్మాతలు పక్కన పెట్టేస్తున్నారని పలువురు నెటిజన్లు చెప్పుకుంటున్నారు. దీంతో కార్తిక్‌ ఆర్యన్‌ కెరీర్‌ గురించి అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు.

నాన్‌ ఫిల్మ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన కార్తిక్‌ ఆర్యన్‌ అసలు పేరు కార్తిక్‌ తివారీ. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. ఇంజినీరింగ్‌ అభ్యసించడం కోసం ముంబయికి వచ్చిన కార్తిక్‌కు సినిమాలపై ఆసక్తి పెరిగింది. నటుడిగా రాణించాలని ఆశపడ్డాడు.

అదే సమయంలో లవ్‌ రంజన్‌తో పరిచయం ఏర్పడింది. అలా, రంజన్‌ తెరకెక్కించిన 'ప్యార్‌ కా పంచ్‌నామా'తో 2011లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం పర్వాలేదనిపించింది. రెండేళ్ల విరామం తర్వాత మరలా అదే దర్శకుడితో 'ఆకాశ్ వాణి'లో నటించి నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. అనంతరం విడుదలైన 'సోనూ కే టీటు కి స్వీటీ-2', 'పతి పత్నీ ఔర్‌ వో' చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించాయి.. అలాగే కార్తిక్‌కు స్టార్‌ స్టేటస్‌ సొంతమయ్యేలా చేశాయి.

నెట్టింటికి చేరిన ప్రేమాయణం..

'పతి పత్నీ ఔర్‌ వో' విజయం తర్వాత ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్‌ అలీతో కలిసి పనిచేసే అవకాశం 'లవ్‌ ఆజ్‌ కల్‌ - 2'తో కార్తిక్‌ని వరించింది. ఆ సమయంలోనే సారా అలీఖాన్‌తో కార్తిక్‌కు పరిచయం ఏర్పడింది. షూట్‌ సమయంలో సారా-కార్తిక్‌ తరచూ హోటల్స్‌, రెస్టారెంట్స్‌, పార్టీల్లో కలిసి కనిపించడం వల్ల వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ చెప్పుకున్నారు.

ఏమైందో ఏమో తెలీదు.. ఉన్నట్టుండి వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. దాంతో, సారా-కార్తిక్‌ బ్రేకప్‌ చెప్పేసుకున్నారని.. దాని కారణంగానే ఆ సినిమా ప్రమోషన్స్‌లోనూ ఇద్దరూ కలిసి పాల్గొనలేదని వార్తలు వచ్చాయి.

ఆఫర్‌ వచ్చి చేజారి..

బాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై తెరకెక్కనున్న 'దోస్తానా-2'లో మొదట కార్తిక్‌ ఆర్యన్‌కు కథానాయకుడిగా అవకాశం లభించింది. ఈ విషయంపై అప్పట్లో ఆయన ఆనందం వ్యక్తం చేశారు కూడా. అయితే.. కొన్ని కారణాలతో కార్తిక్‌ ఆర్యన్‌ ఈ టీమ్‌ నుంచి బయటకు వచ్చేశారని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి.

అదే సమయంలో ధర్మా ప్రొడెక్షన్స్.. 'దోస్తానా-2'కి రీ క్యాస్టింగ్‌ చేస్తున్నాం అని ప్రకటించింది. అంతేకాకుండా మరో కొత్త ప్రాజెక్ట్‌ నుంచి కూడా కార్తిక్‌ని తొలగించారంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు కార్తిక్‌కు సపోర్ట్‌ చేస్తూ నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు.

వైరల్‌గా మారిన కామెంట్లు..

సోషల్‌మీడియాలో అందరూ తన కెరీర్‌ గురించే మాట్లాడుకుంటున్నప్పటికీ కార్తిక్‌ మాత్రం ఈ విషయాలపై పెదవి విప్పలేదు. ఈ క్రమంలోనే దర్శకుడు అనుభవ్‌ సిన్హా చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. "తాము తెరకెక్కించే చిత్రంలో నటీనటులు నచ్చకపోతే వాళ్లను తమ ప్రాజెక్ట్‌ నుంచి నిర్మాతలు తొలగిస్తారు. అదేమాదిరిగా నిర్మాతల ప్రవర్తన నచ్చకపోతే నటీనటులు ఆ సినిమా నుంచే తప్పుకుంటారు. ఇప్పటికే ఇలాంటి విషయాలను ఎన్నో చూశాం. కార్తిక్‌ ఆర్యన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం అన్యాయమైనది. అతడి మౌనాన్ని నేను గౌరవిస్తున్నాను" అని అనుభవ్‌ సిన్హా కామెంట్ పెట్టారు.

అలాగే ఫిల్మ్‌మేకర్‌ అపూర్వ స్పందిస్తూ.. "కార్తిక్‌ ఆర్యన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై అనుభవ్‌ స్పందించడం సంతోషం. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి గతేడాది చర్చించినందుకు అందరూ నన్ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు" అని అన్నాడు. వీళ్ల కామెంట్లతో ఎక్కడ చూసినా కార్తిక్‌ ఆర్యన్‌ కెరీర్‌ గురించే బీటౌన్‌ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.

ఇదీ చూడండి: kartik Aaryan: మరో సినిమా నుంచి తప్పుకున్న బాలీవుడ్​ హీరో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.