టబు.. భాష ఏదైనా నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. నాజూకు రూపంతో సినీ ప్రియుల్నీ కట్టి పడేసింది. టాలీవుడ్‌తో మొదలుపెట్టి హాలీవుడ్ వరకు దిగ్విజయంగా సినీ మజిలీ కొనసాగించింది. రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు దక్కించుకున్న తబుస్సమ్.. అలియస్ టబు పుట్టిన రోజు నేడు.
వందకుపైగా ముద్దు పేర్లు..
చిత్రపరిశ్రమలో ఎక్కువ ముద్దుపేర్లు ఉన్న నటిగా టబు ఘనత సాధించింది. టాబ్స్, టబ్స్, టబ్బీ, టాబ్లర్, టాబ్లోరోన్ ఇలా రకరకాల పేర్లు ఆమె సొంతం. ఆమె ఈమెయిల్ కూడా టాబ్లోరోన్ పేరుతో ఉండడం విశేషం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
షబానా అజ్మీ మేనకోడలు..
టబు అసలు పేరు తబుస్సుమ్ హష్మీ. 1971 నవంబరు 4న హైదరాబాద్‌లో జన్మించింది. తండ్రి జమాల్ హష్మీ, తల్లి రిజ్వానా. ఆమె ఓ స్కూల్ టీచర్. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. సినిమాలపై ఆసక్తితో చిన్నతనంలోనే ముంబయి రైలు ఎక్కింది టబు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'బజార్' అనే హిందీ చిత్రంతో బాలనటిగా చిన్న పాత్ర పోషించింది టబు. ఆ తర్వాత 'హమ్ నే జవాన్'లోనూ మెరిసింది. ఈ సినిమాలోని నటన ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది టబు.
తెలుగులో హీరోయిన్గా అరంగేట్రం..
వెంకటేశ్ హీరోగా వచ్చిన 'కూలీ నెంబర్ 1' చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమైంది. 1991లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. వెంకీ పక్కన తనదైన శైలిలో నటించి అందరిని ఆకట్టుకుంది. టాలీవుడ్లో తక్కువ సినిమాలే చేసినా గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించింది. ఆవిడా మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు, పాండురంగడు, ‘ఇదీ సంగతి' తదితర చిత్రాల్లో నటించి అలరించింది. ఆమె తమిళంలో నటించిన 'కాదల్ దేశమ్' తెలుగులో ‘ప్రేమదేశం’గా విడుదలై ఘనవిజయం అందుకొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హాలీవుడ్‌లోనూ గుర్తింపు...
హిందీలో 1994లో అజయ్‌దేవగణ్ సరసన 'విజయాపథ్'లో నటించి తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ నటనతో మెప్పించింది టబు. ‘ది నేమ్ సేక్, 2012లో విడుదలైన ‘లైఫ్ ఆఫ్ పై’లోనూ ఓ కీలక పాత్ర పోషించి అలరించింది. హిందీలో చేసిన 'చీనీకమ్' కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.
అవార్డులు..
టబు రెండు సార్లు జాతీయ ఉత్తమనటి పురస్కారం దక్కించుకుంది. మాచిస్, చాందిని బార్ సినిమాల్లో నటనకు నేషనల్ అవార్డులు అందుకుంది. ఇవే కాకుండా పలు ఫిల్మ్ వేర్, ఐఫా పురస్కారాలు గెల్చుకుంది. 2011లో భారత ప్రభుత్వం 'పద్మశ్రీ'తో టబును గౌరవించింది.
ఇదీ చదవండి: పోస్ట్ దివాళి వేడుకల్లో దీపికా బిజీ...!