బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆదివారం మధ్యాహ్నం.. ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే అతడి నివాసంలో సూసైడ్ నోట్ లాంటివి ఏవీ దొరకలేదని పోలీసు అధికారి మనోజ్ శర్మ తెలిపారు.
ఇటీవలే సుశాంత్ మాజీ మేనేజర్ దిశా శాలిన్ ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ముంబయిలోని ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ 14వ అంతస్థు నుంచి దూకి మరణించింది. కేవలం ఐదు రోజుల గ్యాప్లోనే సుశాంత్ చనిపోవడం వల్ల.. వీరిద్దరి ఆత్మహత్యలకు సంబంధించిన కామన్ క్లూ ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి... బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య