ఇప్పుడు ప్రపంచమంతటా హాలీవుడ్ సినిమాలు ప్రాంతీయ భాషల్లోనే విడుదల అవుతున్నాయి. మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న 'బ్లాక్ విడో' చిత్రం కూడా భారత్‌లోని విడుదల కానుంది. అయితే హాలీవుడ్లో కంటే ఒక్క రోజు ముందే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సినిమా ఇండియాలో 2020 ఏప్రిల్ 30న విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది.
కేట్ షార్ట్‌లాండ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి స్కార్లెట్ జాన్సన్ ప్రధాన పాత్రలో కనిపించనుంది. డేవిడ్ హార్బర్, ప్లోరెన్స్ ఫగ్, ఓ.టి.ప్యాగ్‌బెన్లీ, రాచెల్ వీజ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మార్వెల్ నుంచి ఈ ఏడాది వచ్చిన 'అవెంజెర్స్: ఎండ్‌గేమ్' భారత్‌లో ఘనమైన వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోనూ నటి స్కార్లెట్ జాన్సన్ నటించి మెప్పించింది. ఇప్పుడు అదే తరహాలో భారత్‌లో మార్కెట్‌ను కోల్పోకుండా మార్వెల్ సంస్థ ఒక్కరోజు ముందుగానే ఇక్కడ విడుదల చేయనుంది.
యు.ఎస్‌లో మాత్రం ఈ సినిమా 2020 మే1న విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలాంటి ప్రాంతీయ భాషల్లో 'బాక్ల్ విడో' చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. బెల్లంకొండ హీరోగా కొత్త సినిమా ప్రారంభం