బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్ బుధవారం 61వ పడిలోకి అడుగుపెట్టాడు. అభిమానులు అతడిని ముద్దుగా 'మున్నాబాయ్' అని పిలుచుకుంటారు. ఈ సందర్భంగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' నుంచి సంజయ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ప్రతినాయకుడు 'అధీరా' పాత్రలో కనిపించనున్నాడు.
సంజయ్ నెగిటివ్ రోల్స్ చేయడం ఇదేం మొదటి సారి కాదు. గతంలోనూ అనేక చిత్రాల్లో విలన్‌గా మెప్పించాడు. ఈ పుట్టినరోజు సందర్భంగా.. సంజయ్ దత్ పోషించిన కొన్ని ప్రతినాయక పాత్రలపై ఓ లుక్కేద్దాం రండి.
1981లో విడుదలైన 'రాకీ'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సంజయ్ దత్.. తొలి చిత్రంతోనే అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అయితే 1990లో వచ్చిన 'జహ్రీలే' సినిమాలో తొలిసారి విలన్ పాత్ర పోషించాడు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్ వచ్చినా.. సంజయ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
![When Sanjay Dutt impressed fans with shady characters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8211962_kalaa_2907newsroom_1595992291_656.jpg)
సంజయ్ నటించిన 'ఖల్ నాయక్' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుభాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజు భాయ్ ప్రతినాయకుడిగా కనిపించాడు. 1993లో విడుదలైన ఈ సినిమా.. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.
![When Sanjay Dutt impressed fans with shady characters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8211962_kartoos_2907newsroom_1595992291_930.jpg)
1999లో వచ్చిన 'కార్టూస్' చిత్రంలో క్రిమినల్ రాజాగా నటించాడు సంజయ్. పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించిన జాకీ ష్రాప్.. అండర్ వరల్డ్ డాన్‌ను పట్టుకునేందుకు దత్‌కు శిక్షణ ఇస్తాడు. ఈ సినిమాలో సంజయ్ నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు.
![When Sanjay Dutt impressed fans with shady characters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8211962_vastav_2907newsroom_1595992291_479.jpg)
మహేశ్ మంజ్రేకర్ దర్శత్వంలో 1999లో వచ్చిన 'వాస్తవ్: ది రియాలిటీ'.. ముంబయి అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో సంజయ్ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.
మల్టీస్టారర్ చిత్రం 'కాంటె'లో సంజయ్ విలన్ రోల్ చేశాడు. 2002లో విడుదలైన ఈ సినిమాను గుప్తా దర్శకత్వం వహించాడు.
![When Sanjay Dutt impressed fans with shady characters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8211962_misaf_2907newsroom_1595992291_1021.jpg)
'ముసాఫిర్'లో సంజయ్ దత్ పాత్రను ఎప్పటికీ మర్చిపోలేం. 2004లో వచ్చిన ఈ సినిమాలో కిల్లర్ బిల్లా పాత్ర పోషించాడు. ఇందులో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు.
![When Sanjay Dutt impressed fans with shady characters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8211962_ani_2907newsroom_1595992291_113.jpg)
'అగ్నిపత్' చిత్రంలో కంచ చీనాగా విభిన్న పాత్రలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు సంజయ్. 2012లో విడుదలైన ఈ సినిమాలో హృతిక్ రోషన్ కథానాయకుడు.
![When Sanjay Dutt impressed fans with shady characters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8211962_paniapt_2907newsroom_1595992291_892.jpg)
గతేడాది విడుదలైన 'పానిపట్' చిత్రంలో సంజయ్ పోషించిన అహ్మద్ షా అబ్దాలి పాత్రకు విమర్శకుల ప్రశంసలూ అందుకున్నాడు. అశుతోష్ గోవార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. అర్జున్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
-
It's been a pleasure working on this film and I couldn't have asked for a better birthday gift. Thank you @prashanth_neel, @Karthik1423, @TheNameIsYash, @VKiragandur, #Deepak, #Lithika, #Pradeep & the entire team of KGF. pic.twitter.com/5BPX8injYM
— Sanjay Dutt (@duttsanjay) July 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">It's been a pleasure working on this film and I couldn't have asked for a better birthday gift. Thank you @prashanth_neel, @Karthik1423, @TheNameIsYash, @VKiragandur, #Deepak, #Lithika, #Pradeep & the entire team of KGF. pic.twitter.com/5BPX8injYM
— Sanjay Dutt (@duttsanjay) July 29, 2020It's been a pleasure working on this film and I couldn't have asked for a better birthday gift. Thank you @prashanth_neel, @Karthik1423, @TheNameIsYash, @VKiragandur, #Deepak, #Lithika, #Pradeep & the entire team of KGF. pic.twitter.com/5BPX8injYM
— Sanjay Dutt (@duttsanjay) July 29, 2020
'కేజీఎఫ్ చాప్టర్ 2' రాకముందే సంజయ్ దత్ పాత్రపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా బుధవారం దత్.. అధీరా పాత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.