Biggboss Himaja: బిగ్‌బాస్ బ్యూటీ, నటి హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ఆ తర్వాత సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. కొన్నాళ్లకు బుల్లితెరకు గుడ్‌బై చెప్పి వెండితెరపై అవకాశాలు దక్కించుకుంది. సినిమాల్లో హీరోయిన్ పక్కన స్నేహితురాలి పాత్రలో ఎక్కువగా కనిపించిన నటి హిమజ.. బిగ్‌బాస్ తర్వాత మరింత పాపులర్ అయ్యింది.
Bigboss Himaja Latest Reel: బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు కొంత నెగెటివిటీ మూటగట్టుకున్నప్పటికీ బయటకు వచ్చాక మాత్రం టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ కెరీర్లో ముందుకెళ్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తనకు సంబంధించిన అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తాటిరేకులో కల్లు తాగుతూ హిమజ ఎంజాయ్ చేసింది. చివర్లో కల్లు సూపర్‌గా ఉందంటూ ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చింది. ట్రెండింగ్‌లో ఉన్న ఫేమస్ అరబిక్ కుతు సాంగ్‌ను ఈ వీడియోకు జతచేసి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దాన్ని మీరు చూసేయండి..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చదవండి: నేను ఆ నటులతోనే వర్క్ చేయాలనుకుంటాను: రాజమౌళి