ETV Bharat / sitara

ఆ బాలీవుడ్ హీరోయిన్ 'ఆమిర్​ ఖాన్ లేడీ వెర్షన్'! - Bhumi Pednekar latest news

స్టార్ హీరో ఆమిర్​ ఖాన్​కు లేడీ వెర్షన్​ ఆ నటి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అర్షద్ వార్సీ. ఇతడు నటించిన 'దుర్గమతి'.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Bhumi Pednekar is the female version of Aamir Khan: Arshad warsi
ఆ బాలీవుడ్ హీరోయిన్ 'ఆడ ఆమిర్​ఖాన్'!
author img

By

Published : Dec 5, 2020, 7:50 AM IST

కథానాయిక భూమి పెడ్నేకర్​ను సూపర్​స్టార్ ఆమిర్​ఖాన్​తో పోల్చారు ప్రముఖ నటుడు అర్షద్ వార్సీ. వీరిద్దరూ 'దుర్గమతి' సినిమాలో కలిసి నటించారు. ఈనెల 11న అమెజాన్ ప్రైమ్​లో అది విడుదల కానుంది. ఈ సందర్భంగా భూమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అర్షద్.

"భూమి పెడ్నేకర్ చాలా కష్టపడి పనిచేస్తుంది. ఓ విషయం సరిగ్గా చేసేంతవరకు అస్సలు ఆపదు. ఆమెతో నటించడం అంటే చాలా కష్టం. అద్భుతంగా పాత్రను పండించింది. షూటింగ్​లో ఒకసారి ఆమెను పిలిచి.. 'నువ్వు ఆమిర్​ ఖాన్​కు అమ్మాయి వెర్షన్​' అని చెప్పాను" అని అర్షద్ వార్సీ తెలిపారు.

అనుష్క 'భాగమతి'కి హిందీ రీమేక్​ ఈ సినిమా. హారర్​ కథాంశంతో దీనిని తెరకెక్కించారు. మాతృకకు రూపొందించిన అశోక్.. రీమేక్​కూ దర్శకత్వం వహించారు.

durgamati cinema
'దుర్గమతి' సినిమా పోస్టర్
Arshad warsi
దుర్గమతి సినిమాలో అర్షద్ వార్సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.