అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'. ఈ సినిమాలో తొలుత టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో నటించేందుకు అంగీకారం తెలిపాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం నుంచి ఈ హీరో తప్పుకున్నాడు. ఇప్పుడు అదే పాత్రలో నటుడు, మోడల్ శరద్ కేల్కర్ కనిపించనున్నాడు. ఈ అంశాన్ని అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది.
ఈ అవకాశం దక్కడంపై శరద్ స్పందిస్తూ.. "తాను చిన్నతనం నుంచి ఆర్మీలో చేరాలని కోరిక ఉండేది. కానీ అది తీరలేదు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నాడు. ఈ సినిమాలో శరద్ సైనికాధికారిగా నటించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా తప్పుకుంది. ఈమె స్థానంలో నోరా ఫతేహి నటిస్తోంది. సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేకర్, ప్రణీత సుభాష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇవీ చూడండి.. మహేశ్-రష్మిక డ్యాన్స్.. అభిమానుల 'మైండ్‌బ్లాక్'