ETV Bharat / sitara

'భీమ్లా నాయక్'​ ఫ్యాన్స్​కు వీకెండ్​లో మ్యూజికల్ ట్రీట్ - సినిమా వార్తలు తెలుగు

Bheemla Nayak Updates: పవర్​స్టార్​ పవన్ ​కల్యాణ్​, దగ్గుబాటి రానా నటిస్తున్న మల్టీస్టారర్​ చిత్రం 'భీమ్లా నాయక్​'. ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్​ను ప్రకటించింది చిత్రబృందం.

movie updates
'భీమ్లానాయక్'​
author img

By

Published : Dec 3, 2021, 6:48 PM IST

Updated : Dec 3, 2021, 9:49 PM IST

Bheemla Nayak Updates: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​, దగ్గుబాటి రానా కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్​'. సాగర్​ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రబృందం రిలీజ్​ చేస్తున్న ఒక్కో అప్డేట్​ వారి అంచనాలను మరింత పెంచుతున్నాయి. తాజాగా మరో కొత్త అప్డేట్​ను ప్రకటించింది మూవీటీమ్​.

movie updates
'భీమ్లానాయక్​'లో రానా, పవన్​కల్యాణ్​

ఈ చిత్రానికి సంబంధించిన నాలుగో పాటను శనివారం ఉదయం 10.08 గంటలకు రిలీజ్​ చేస్తున్నట్లు ప్రకటించింది. 'అడవి తల్లి మాట' అంటూ సాగే ఈ పాట కోసం ఫ్యాన్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల రిలీజ్​ చేసిన 'లాలా భీంలా' పాట మంచి క్రేజ్​ను సంపాదించింది. ఈ సినిమాకు తమన్​ బాణీలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్​ కానుంది.

లక్ష్య సాంగ్...

నాగశౌర్య కథనాయకుడిగా సంతోష్​ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లక్ష్య'. కాలభైరవ బాణీలు అందిస్తున్న ఈ చిత్రం నుంచి మరో సాంగ్​ రిలీజ్​ కానుంది. శనివారం సాయంత్రం 4.05 గంటలకు 'సయా సయా' అనే పాటను యువసామ్రాట్​ నాగచైతన్య చేతుల మీదుగా లాంచ్​ చేయనుంది చిత్రబృందం.

movie updates
'లక్ష్య' అప్డేట్​

యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్-టాలీవుడ్​ బ్యూటీ పూజా హెడ్గే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్​'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలై 'నగుమోము తారలే' పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. యూట్యూబ్​ ఇప్పటివరకు ఈ పాటకు 35 మిలియన్ (3.5 కోట్ల)​ వ్యూస్​ వచ్చాయి. ఈ పాటను మూవీటీమ్​ ఐదు బాషల్లో రిలీజ్​ చేసింది.

movie updates
'రాధేశ్యామ్'​ పోస్టర్​

శ్రీజిత్​ ముఖర్జీ దర్శకత్వంలో 'శభాష్​ మిథు' పేరుతో ప్రముఖ క్రికెటర్​ మిథాలీ రాజ్​ జీవిత కథ తెరకెక్కుతోంది. తాప్సీ ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది.

movie updates
'శబాష్​ మిథూ' పోస్టర్

రాజ్​శేఖర్​ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శేఖర్​'. ఇప్పుడు ఈ సినిమా విడుదలపై చిత్రబృందం​ సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. మలయాళ చిత్రం జోసెఫ్​కు రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు మూవీ టీమ్​ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మిగతా సినిమాల నుంచి పోటీ, కరోనా పరిస్థితులే ప్రధాన కారణమని అంటున్నాయి సినీ వర్గాలు.

movie updates
'శేఖర్​'

ఇదీ చూడండి : అంత వయసులోనూ ఈ ఫిట్​నెస్.. ఎలా మలైకా?

Last Updated : Dec 3, 2021, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.