ETV Bharat / sitara

త్రివిక్రమ్​పై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు.. వివాదం అందుకేనా? - bandla ganesh bheemla nayak

Bandla Ganesh Trivikram: పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన 'భీమ్లానాయక్​' రిలీజ్​కు​ సిద్ధంగా ఉన్న సమయంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్​ పేరుతో ఓ ఆడియో విపరీతంగా వైరల్​ అవుతోంది. దర్శకుడు త్రివిక్రమ్​పై బండ్ల తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అందులో ఉంది.

bandla ganesh trivikram
bandla ganesh audio
author img

By

Published : Feb 22, 2022, 5:00 PM IST

Bandla Ganesh Trivikram: పవన్ కల్యాణ్, రానా నటించిన 'భీమ్లానాయక్' సినిమా విడుదల వేళ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో వివాదాస్పదంగా మారాయి. బండ్ల గణేశ్ ఓ అభిమానితో మాట్లాడిన ఆడియో టేపు లీకై నెట్టింట్లో వైరల్​గా మారింది. ఆ ఆడియోలో దర్శకుడు త్రివిక్రమ్​పై బండ్ల గణేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. 'భీమ్లానాయక్' ఈవెంట్​కు తనకు ఆహ్వానం అందలేదని, దర్శకుడు త్రివిక్రమ్ తనను దూరం పెట్టారని, వైకాపా నేతలతో కలిసి కుట్ర చేస్తున్నారని బండ్ల గణేశ్ ఆరోపించారు. ఈవెంట్ జరిగే సమయంలో తన పేరుతో గట్టిగా అరవాలని అభిమానులను కోరారు.

ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి?

అయితే ఆ ఆడియోపై బండ్ల గణేశ్ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ట్విట్టర్ ఖాతాలో ఎక్కువ నమ్మడం, ఎక్కువ ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం, ఎక్కువగా చనువు ఇవ్వడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగా ఉంటుందని రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు బండ్ల గణేశ్ ఎవరిని ఉద్దేశించి రాసుకొచ్చారోనని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

త్రివిక్రమ్​తో వివాదం ఏంటి?

'భీమ్లానాయక్' ప్రిరీలిజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరగనున్న క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్​పై బండ్ల గణేశ్ వాయిస్​తో ఆడియో బయటకు రావడం పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బండ్ల గణేశ్, త్రివిక్రమ్ మధ్య అసలు వివాదమేంటని ఆరా తీస్తున్నారు. నగర శివారులోని భూ వివాదంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే బండ్ల గణేశ్.. త్రివిక్రమ్​పై ఆరోపణలు చేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి: 'భీమ్లానాయక్'​తో పోటీ నుంచి తప్పుకొన్న వరుణ్​తేజ్ 'గని'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.