ETV Bharat / sitara

'భామా కలాపం' ట్రైలర్‌.. రొమాంటిక్‌గా '30 వెడ్స్‌ 21' సీజన్‌ 2 టీజర్‌ - అల్లరి నరేష్

Bhama Kalapam Trailer: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చాశాయి. ప్రియమణి ప్రధాన పాత్రలో 'భామా కలాపం', సుమంత్ 'మళ్లీ మొదలైంది' సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

30 Weds 21
bhama kalapam
author img

By

Published : Jan 31, 2022, 9:03 PM IST

Bhama Kalapam Trailer: ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన ఓటీటీ చిత్రం 'భామా కలాపం'. అభిమన్యు దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ నేపథ్యంలో యువ నటుడు విజయ్‌ దేవరకొండ ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను బాపినీడు, సుధీర్‌ నిర్మించారు. దర్శకుడు భరత్‌ కమ్మ సమర్పిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు సమకూర్చగా మార్క్‌ కె. రాబిన్‌ నేపథ్య సంగీతం అందించారు.

రొమాంటిక్‌గా '30 వెడ్స్‌ 21' సీజన్‌ 2 టీజర్‌

30 Weds 21 Season 2 Teaser: అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు వెబ్‌ సిరీస్‌ల్లో '30 వెడ్స్‌ 21' ఒకటి. 6 ఎపిసోడ్ల సమాహారంగా 2021లో సీజన్‌- 1 విడుదలై కొత్త అనుభూతిని పంచింది. ఎప్పుడెప్పుడు సీజన్‌ 2 వస్తుందా? అని ఎదురుచూసిన వారికి శుభవార్తను వినిపించింది నిర్మాణ సంస్థ చాయ్‌ బిస్కెట్‌. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సీజన్‌- 2ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీజర్‌ను పంచుకుంది.

ఈ టీజర్‌లో.. నాయకానాయికలు చైతన్యరావు, అనన్య జంట చూడముచ్చటగా ఉంది. ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్‌ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మనోజ్‌ పీ కథ అందిస్తున్న ఈ సిరీస్‌కు పృథ్వీ వనం దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌కి సంగీతం: జోస్‌ జిమ్మీ, ఛాయాగ్రహణం: ప్రత్యక్ష్య రాజు.

ఆసక్తిగా 'మళ్లీ మొదలైంది' ట్రైలర్‌

విడాకులు తీసుకున్న ఓ యువకుడు.. తన న్యాయవాదితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఈ విభిన్నమైన కాన్సెప్ట్‌తోనే తెరకెక్కింది 'మళ్లీ మొదలైంది' చిత్రం. సుమంత్‌, వర్షిణి సౌందర్‌ రాజన్‌, నైనా గంగూలీ ప్రధాన పాత్రధారులు. టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న ఓటీటీ జీ5లో నేరుగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ప్రముఖ నటుడు వెంకటేష్‌ సామాజిక మాధ్యమాల వేదికగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. విడాకులు తీసుకున్న కొందరి ప్రముఖుల ఫొటోతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందించారు.

రవితేజ ప్రెజెంట్స్​.. 'ఎఫ్​ఐఆర్​'

ravi teja
రవితేజ సమర్పణలో 'ఎఫ్​ఐఆర్​'

మాస్​ మహారాజా రవితేజ సమర్పణలో తమిళ నటుడు విష్ణు విశాల్​ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం 'ఎఫ్​ఐఆర్'​. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదలకానుంది. మంజిమా మోహన్ హీరోయిన్.

'డాన్' ఆగమనం ఆరోజే..

శివకార్తికేయన్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంటగా నటించిన తమిళ చిత్రం 'డాన్‌'. చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌- కామెడీ సినిమాకి అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పణలో శివకార్తికేయన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

allari naresh
అల్లరి నరేశ్​ కొత్త సినిమా ముహూర్తం ఫిబ్రవరి 1న
pakka commercial
ఫిబ్రవరి 2న 'పక్కా కమర్షియల్' పాట

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 'ఆర్​ఆర్​ఆర్', 'ఆచార్య'​, 'భీమ్లా నాయక్​', 'సర్కారు వారి పాట' రిలీజ్​ డేట్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.