టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమాలు చాలానే చూసి ఉంటాం. క్లిష్టమైన సిద్ధాంతాలతో కూడి ఉంటాయి. సైన్స్ ఫిక్షన్ ప్రధానంగా ఉంటుంది. కల్పిత సీన్లు ఎక్కువగా కనిపిస్తాయి. అయినప్పటికీ.. ప్రేక్షకున్ని సంతృప్తిపరిచే విధంగా సరిగ్గా తీసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాలపైనే ఈ కథనం.
ప్రైమర్..
ఇద్దరు స్నేహితులు కలిసి గతానికి వెళ్లే టైమ్ మెషిన్‌ను కనుగొంటారు. దానితో స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు. చివరికి ప్రణాళిక వికటిస్తుంది.
ఎందుకు చూడాలంటే..
టైమ్ ట్రావెల్ సినిమాల్లో ఎవర్గ్రీన్ ఇది. మొదటిసారి చూస్తే సరిగా అర్థం కాదు. కానీ యూట్యూబ్‌లో 23 నిమిషాల యానిమేటెడ్ మూవీ చూసిన తర్వాత అయితేనే అవన్నీ ఎలా పనిచేస్తాయి అనేదానిపై ఓ అవగాహన వస్తుంది. కాస్త.. నమ్మశక్యంగా ఉండదు. ఈ చిత్ర డైరెక్టర్ కూడా సులభంగా తీయడానికి నిరాకరించారు. కానీ టైమ్ ట్రావెల్ మూవీలు ఇష్టమైతే.. ఇది తప్పక చూడాల్సిందే.
ద బటర్ ఫ్లై ఎఫెక్ట్..
ఓ వ్యక్తి టైమ్ ట్రావెల్‌ను ఉపయోగించి తన చిన్ననాటి నుంచి భవిష్యత్‌ను, గతాన్ని చూస్తాడు.
ఎందుకు చూడాలంటే..
2004 ఏడాది టైమ్ ట్రావెల్ సినిమాలకు అతి గొప్ప సమయం. ఈ కాలంలో ప్రైమర్, బటర్ ఫ్లై సినిమాలు రెండీ రిలీజ్ అయ్యాయి. బటర్ ఫ్లై సినిమా మొదట విమర్శలకు లోనైంది. ఎందుకంటే ఇతర టైమ్ ట్రావెల్ సినిమాల కన్నా ఇది విభిన్నం. కానీ తర్వాత ప్రేక్షకామోదం పొందింది. ఆ రోజుల్లో 81 శాతం మంది ఈ సినిమాకు అనుకూలంగా రేటింగ్ ఇచ్చారు. తప్పక చూడాల్సిన టైమ్ ట్రావెల్ సినిమా.
హ్యాపీ డెత్ డే..
ఓ యూనివర్సిటీ స్టుడెంట్ని ఆయన పుట్టిన రోజే మర్డర్ చేస్తాడో దుండగుడు. అదే రోజున మళ్లీ.. మళ్లీ జన్మిస్తాడు ఆ కుర్రాడు.
ఎందుకు చూడాలంటే..
టైమ్ ట్రావెల్ సినిమాల్లో సైన్స్ ఫిక్షన్ అధికంగా ఉన్న సినిమా ఇది. అక్కడక్కడా కామెడీ అలరిస్తుంది. బేబీ మాస్క్ ధరించడం, ప్రతిచోట కిల్లర్ ఉండడం, మిస్టరీ, ప్రధాన పాత్రదారుడు చేసే ప్రయాణం చూడదగింది.
ఇంటర్స్టెల్లార్..
ఈ సినిమాలో జీవించడానికి ఇంకో గ్రహాన్ని కనుగొనే ప్రయత్నంలో బ్లాక్ హోల్ గుండా ప్రయాణం చేస్తారు వ్యోమగాములు.
ఎందుకు చూడాలంటే..
ఇది అంతరిక్ష ప్రయాణంతో కూడిన సైన్స్ ఫిక్షన్ సినిమా. దీనికి టైమ్ ట్రావెల్‌ను యాడ్ చేసి.. అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. సైంటిఫిక్‌గా కాస్త డీప్‌గా ఉంటుంది. అలాగే.. టైమ్ ట్రావెల్లో ఉత్తమ సినిమా ఇది.
ది టర్మినేటర్..
భవిష్యత్‌లో ఓ వ్యక్తిని రక్షించే తల్లిని చంపడానికి ఈ సినిమాలో ఓ రోబోని గతానికి పంపిస్తారు.
ఎందుకు చూడాలంటే..
మీరు ఈ క్లాసిక్ మూవీని చూసే ఉంటారు. ఒకవేళ చూడలేకపోతే తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఇందులో రోబోలతో పాటు టైమ్ ట్రావెల్ గురించి ఉంటుంది. ఎలాంటి భావోద్వేగాలు లేని రోబో గోడలను ఎలాగైతే పగులకొడుతుందో మనుషులతోనూ అలాగే ఫైట్ చేస్తుంది. అలాంటి రోబో టైమ్ ట్రావెల్ సినిమాను తప్పక చూడండి.
బ్యాక్ టూ ఫ్యూచర్
టైమ్ మెషిన్ని ఉపయోగించి ఓ టీనేజర్‌తో కలిసి ఓ శాస్త్రవేత్త 30 ఏళ్ల వెనక్కి వెళ్తాడు.
ఎందుకు చూడాలంటే..
టైమ్ ట్రావెల్ మూవీల్లో ఇది ఎవర్గ్రీన్. ఎంటర్టైన్మెంట్, ప్రధాన పాత్రదారుడి టైమ్ ట్రావెల్ ప్రయాణం, యుక్త వయస్కులైన తల్లిదండ్రులతో మాట్లాడడం అద్భుతంగా ఉంటుంది. మూవీ పార్ట్ 2లో భవిష్యత్‌లోకి వెళ్లడం ఉంటుంది. టైమ్‌ట్రావెల్‌లో చూడాల్సిన చిత్రమిది.
ఎబౌట్ టైమ్..
ఓ కుటుంబంలో తండ్రి, కూతురు టైమ్ ట్రావెల్ చేస్తారు ఈ సినిమాలో.
ఎందుకు చూడాలంటే..
రొమాంటిక్ ట్విస్ట్‌తో కూడిన మూవీ ఇది. ప్రధాన పాత్రదారుడు తన సోదరి స్నేహితురాలిని ప్రేమిస్తాడు. టైమ్ ట్రావెల్ తర్వాత వెనుకకు రాలేకపోతాడు. ప్రేయసి అతన్ని మర్చిపోతుంది. మళ్లీ తెలుసుకుని టైమ్ ట్రావెల్ చేయగలిగే నాటికి తన ప్రేమను వ్యక్తపరచలేడు. టైమ్ ట్రావెల్లో తప్పక చూడాల్సిన చిత్రమిది.
12 మంకీస్
2035 నుంచి 90ల్లోని ప్రాణాంతక వైరస్‌ను హతమార్చడానికి ఓ వ్యక్తి టైమ్ ట్రావెల్ చేస్తాడు.
ఎందుకు చూడాలంటే..
లక్ష్య ఛేదన దిశగా సాగే ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. సినిమాలో టైమ్ ట్రావెల్ సీన్లు చాలా ఉంటాయి. ట్విస్ట్‌లు అంతగా కనిపించవు. కానీ టైమ్‌ట్రావెల్ మూవీ చూడాలనుకుంటే దీనిని తప్పక చూడాలి. సినిమా అనంతరం ఆలోచింపజేసే విధంగా ఎండ్ ఉంటుంది.
డొన్నీ డార్కో..
ఈ సినిమాలో తన ఇంటి పైకప్పును ఓ జెట్ ఇంజిన్ ఢీకొట్టిన తర్వాత ఓ టీనేజర్‌కు పీడకలలు వస్తుంటాయి.
ఎందుకు చూడాలంటే..
డొన్నీ డార్క్ అద్భుతమైన టైమ్ ట్రావెల్ సినిమా. మిస్టరీ, కామెడీ, ఆందోళన, అన్నీ కలగలిసిన చిత్రమిది. టైమ్ ట్రావెల్లో కొన్ని విషయాలు అంత తేలిగ్గా అర్థం కావు. కానీ చివరి వరకు సందేహాలన్నీ తీరిపోతాయి. టైమ్ ట్రావెల్ సినిమా మళ్లీ చూడాలనుకుంటే తప్పక వీక్షించాల్సిన చిత్రమిది.
ఇదీ చదవండి:రణ్వీర్ నయా లుక్.. నెట్టింట హాట్ టాపిక్