ETV Bharat / sitara

ఆ ఒక్క మాట నన్ను చాలా మార్చింది: సాయిశ్రీనివాస్ - బెల్లంకొండ శ్రీనివాస్ లేటేస్ట్ న్యూస్

తన 'అల్లుడు అదుర్స్' సినిమా గురించి హీరో సాయిశ్రీనివాస్ చాలా విషయాలు పంచుకున్నారు. దీనితో తన వ్యక్తిగత జీవిత విశేషాలను వెల్లడించారు.

bellamkonda srinivas about alludu adhurs cinema and his life
ఆ ఒక్క మాట నన్ను చాలా మార్చింది: సాయిశ్రీనివాస్
author img

By

Published : Jan 3, 2021, 6:37 AM IST

ఈసారి మన సినీ సంక్రాంతి అల్లుడు... బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. పెద్ద పండగకు ఇంటిల్లిపాదినీ థియేటర్లకు రప్పించి... అల్లుడిగా వినోదాలు పంచుతానని నమ్మకంగా చెబుతున్నారు. సాయి శ్రీనివాస్‌ హీరోగా, సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తీసిన చిత్రం 'అల్లుడు అదుర్స్‌'. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సంక్రాంతికి ఇంకా సమయం ఉన్నా... నాకు ఇప్పటికే పండగ మొదలైందని అంటున్నారు సాయి. ఆదివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ఫోన్‌లో ముచ్చటించారు.

"ఎవరికైనా పుట్టినరోజే పండగలా ఉంటుంది. నాకు మాత్రం పండగ సందడి మధ్యే పుట్టిన రోజు వస్తుంది. నూతన సంవత్సరాది జోష్‌ను ఆస్వాదిస్తుండగానే... 3వ తేదీన నా పుట్టినరోజు. ఆ వెంటనే సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఈసారి పుట్టిన రోజున కూడా పని చేస్తూ గడపబోతున్నా. కశ్మీర్‌లో 'అల్లుడు అదుర్స్‌' చివరి పాటను తెరకెక్కిస్తున్నాం. ఈ పాటతో షూటింగ్‌ పూర్తవుతుంది. ఈసారి సంక్రాంతికి నా సినిమా విడుదలవుతోంది. ఈ ఏడాదే హిందీలోకీ అడుగు పెడుతున్నా. అందుకే 2021 నాకు అన్ని విధాలుగా ప్రత్యేకం"

అసలైన పండగ సినిమా

"సినిమా చూడటానికి కుటుంబమంతా కలిసి వచ్చిందంటే ఆ ఆనందమే వేరు. చూస్తున్న ప్రేక్షకులకే కాదు, సినిమా చేసిన మా అందరికీ అదెంతో సంతోషం. నిర్మాతగా మా నాన్న వాణిజ్య ప్రధానమైన కుటుంబ కథల్నే నిర్మించారు. కథానాయకుడిగా నాకూ అలాంటి కథల్ని ఎంపిక చేసుకోవడమే నేర్పించారు. 'అల్లుడు అదుర్స్‌' ఇంటిల్లిపాదినీ మెప్పించే ఓ మంచి కథ. అసలు సిసలు పండగ సినిమా. వాణిజ్య కథ అయినా... ఇందులో నేను సవాల్‌తో కూడుకున్న పాత్రను చేశా. అదెలా అనేది రెండు రోజుల్లో విడుదల కానున్న ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది".

alludu adhurs cinema
సంక్రాంతి కానుకగా అల్లుడు అదుర్స్ సినిమా

అల్లుడు అచ్చొచ్చింది

"నా తొలి సినిమా 'అల్లుడు శీను'. మరోసారి అల్లుడిగా తెరపైకొస్తున్నా. అల్లుడు అనే పదం నాకు బాగా అచ్చొచ్చింది. చిత్ర పరిశ్రమలో నన్నెవరూ అలా పిలిచేవాళ్లు లేరు కానీ, మా మేనమామ కిరణ్‌ మాత్రం 'అల్లుడూ...' అనే పిలుస్తుంటారు. అమెరికాలో ఉండే ఆయన నా సినిమాలకు మంచి విమర్శకుడు. 'అల్లుడు అదుర్స్‌' అనే పేరుతో దర్శకుడు సంతోష్‌ అన్న రాగానే వెంటనే నాకు కిక్‌ వచ్చింది. ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకు సందడే సందడి".

పరాజయాలూ నేర్పాయి

"ఆరేళ్ల ప్రయాణంలో చాలా పాఠాలు నేర్చుకున్నా. 'కవచం' నుంచే భిన్నమైన సినిమాలు చేయడం మొదలుపెట్టా. కానీ 'రాక్షసుడు'తో ఫలితం వచ్చింది. ఒక నటుడిగా నేనేం చేయాలి? ఎలాంటి కథల్ని ఎంచుకోవాలనే విషయాలపై ఇప్పుడు మరింత పరిణతితో ఆలోచిస్తున్నా. పరాజయాలు చాలా విషయాల్ని నేర్పిస్తుంటాయి. 'సాక్ష్యం' కోసం చాలా బడ్జెట్‌ పెట్టి, కష్టపడి పనిచేశాం. తగ్గ ఫలితం రాలేదు. నేను బాధపడుతుంటే, మా నాన్న నన్ను అంధ విద్యార్థుల పాఠశాలకు తీసుకెళ్లి భోజనాలు వడ్డించమని చెప్పారు. నేనే బాధతో ఏడుస్తుంటే మా నాన్న ఇవన్నీ చేయమంటున్నారేమిటి అనుకున్నా. కానీ అక్కడ భోజనాలు వడ్డించి, కార్‌ ఎక్కుతుంటే చాలా తృప్తి కలిగింది. 'నువ్వు ఏం కోల్పోయావని బాధపడుతున్నావ్‌? ఆ పిల్లలు తినే ఆహారాన్ని కూడా చూడలేరు. కానీ వాళ్లు ఎంత సంతోషంగా ఉన్నారో చూశావా?' అన్నారు. ఆ ఒక్క మాట నేను జీవితాన్ని చూసే విధానాన్నే మార్చింది"

alludu adhurs cinema
'అల్లుడు అదుర్స్' సినిమా పోస్టర్

'ఛత్రపతి' రీమేక్‌ కోసం

"నా సినిమాలు హిందీలో డబ్‌ అవుతూ విశేష ఆదరణ పొందుతుంటాయి. అలాంటి ఓ మార్కెట్‌ నాకు ఏర్పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. మా నాన్న ఆ విషయంలో గర్వపడుతుంటారు. ఏడాది కాలంగా హిందీ నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 'ఛత్రపతి' రీమేక్‌ అవకాశం వచ్చాక 'హిందీలో పరిచయం కావడానికి ఇదే సరైన కథ' అని వెంటనే ఒప్పుకొన్నా"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.