ETV Bharat / sitara

బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ.. లాంఛనంగా ప్రారంభం - ఛత్రపతి రీమేక్​తో బాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్​లోకి బెల్లంకొండ శ్రీనివాస్​ ఎంట్రీ ఇవ్వనున్నారు. 'ఛత్రపతి' రీమేక్​తో అక్కడ అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాకు వి.వి.వినాయక్​ దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Bellamkonda Sai Sreenivas to debut in Bollywood with 'Chatrapathi' remake
'ఛత్రపతి' రీమేక్​ షురూ.. దర్శకుడిగా వినాయక్​
author img

By

Published : Nov 27, 2020, 10:58 AM IST

Updated : Nov 27, 2020, 12:01 PM IST

యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్​ బాలీవుడ్​లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రభాస్​ 'ఛత్రపతి'ని రీమేక్​ చేస్తున్నారు. శుక్రవారం అధికారిక ప్రకటన రావడం సహా దర్శకుడిగా వి.వి.వినాయక్​ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. పెన్​ స్టూడియోస్ నిర్మిస్తోంది.

2005లో వచ్చిన ఛత్రపతి.. ప్రభాస్​కు స్టార్ హోదా తీసుకురావడం సహా రాజమౌళి సత్తా ఏంటో మరోసారి తెలియజేసింది. బాక్సాఫీస్​ దగ్గర వసూళ్ల రికార్డులను నమోదు చేసింది.

"బాలీవుడ్​లో గ్రాండ్​గా ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన సినిమా. ప్రభాస్​ పాత్రను పోషించడం పెద్ద బాధ్యతే. కానీ, అందులో నటించనుండటం చాలా ఆనందంగా ఉంది" - బెల్లంకొండ శ్రీనివాస్​, కథానాయకుడు

'అల్లుడు శీను' చిత్రంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్​ను హీరోగా పరిచయం చేసిన దర్శకుడే.. బాలీవుడ్​కూ పరిచయం చేస్తుండటం విశేషం. శ్రీనివాస్ నటించిన 'జయ జానకి నాయక', 'సాక్ష్యం', 'కవచం', 'సీతా' చిత్రాలు హిందీలో డబ్​ అయ్యి విశేష ఆదరణ దక్కించుకున్నాయి. మిలియన్ల వ్యూస్​ను సొంతం చేసుకున్నాయి.

Last Updated : Nov 27, 2020, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.