ETV Bharat / sitara

బోయపాటి సినిమాలో 'అఖండ'గా బాలయ్య - Balakrishna and Boyapati Srinu movie titled as Akhanda

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి టైటిల్​ను ఖరారు చేశారు. 'అఖండ' అనే టైటిల్​తో ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో బాలయ్య అఘోర లుక్​లో అదరకొట్టే డైలాగులతో ఆకట్టుకున్నారు.

Balakrishna and Boyapati Srinu movie titled as Akhanda
అఖండ చిత్రంలో బాలయ్య
author img

By

Published : Apr 13, 2021, 12:38 PM IST

Updated : Apr 13, 2021, 12:58 PM IST

నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆ సినిమాకు 'అఖండ' టైటిల్​ను ఖరారు చేస్తూ.. ఉగాది సందర్భంగా అఘోర పాత్ర పరిచయ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. "కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది!!!" అంటూ బాలయ్య చెప్పే డైలాగ్​ ఆకట్టుకునే విధంగా ఉంది. దీనికి తోడు తమన్​ బ్యాగ్రౌండ్​ మ్యాజిక్​తో ఈ టీజర్​ అదిరిపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ కథానాయికలు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయంతో మెప్పించనున్నారని ప్రచారం జరుగుతోంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకురానుంది.

Balakrishna and Boyapati Srinu movie titled as Akhanda
'అఖండ' సినిమా పోస్టర్​

ఇదీ చూడండి: ఉగాది వేళ.. టాలీవుడ్​లో పోస్టర్ల మేళ!

Last Updated : Apr 13, 2021, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.