ETV Bharat / sitara

'ఆదిత్య 369' సంచలనం.. మరి 'ఆదిత్య 999' ? - ఆదిత్య సీక్వెల్​

నందమూరి నటసింహం బాలకృష్ణ, సంగీతం శ్రీనివాసరావుల కాంబినేషన్​లో వచ్చిన క్లాసిక్ హిట్ 'ఆదిత్య 369'. టైమ్​ మిషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. తాజాగా 29 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర విశేషాలు మీ కోసం..

balayya
బాలయ్య
author img

By

Published : Jul 19, 2020, 10:14 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో అద్భుత పాత్రల్లో నటించారు. వాటిల్లో 'ఆదిత్య 369' ఒకటి. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆణిముత్యంగా నిలిచి.. నేటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూనే ఉంది. టైమ్​ మిషన్( భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల) నేపథ్యంలో సైన్స్‌ ఫిక్షన్‌, చరిత్ర, ప్రేమ, క్రైమ్‌లను సమ్మిళితం చేసి ఈ చిత్రాన్ని.. దర్శకుడు సంగీతం శ్రీనివాసరావులు తెరకెక్కించారు. ఈ కథాంశానికి అప్పట్లో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా విడుదలై జులై 18తో 29 ఏళ్లు పూర్తయ్యాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రత్యేకతలు

ఈ చిత్రానికి సంగీతం శ్రీనివాసరావు అద్భుతమైన దర్శకత్వం, జంధ్యాల వినోద, సరస సంభాషణలతో పాటు వైవిధ్యమైన కథ, ఇళయరాజా సంగీతం, వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, పిసి శ్రీరామ్‌, విఎస్‌ఆర్‌ స్వామి, కబీర్‌లాల్‌ల ఛాయాగ్రహణం వంటివి ఈ సినిమా బలాలు. దీన్ని శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శ్రీమతి అనితా కృష్ణ నిర్మించారు.

విజయనగర రాజ్యం కాలంలో కృష్ణమోహన్‌ అనే (తరువాతి కాలం నుంచి వచ్చిన) యువకునిగానూ, కృష్ణదేవరాయలుగానూ రెండు పాత్రల్లో అద్భుతాభినయాన్ని కనబరిచారు బాలయ్య. ఆహార్యంలోనూ తన తండ్రి ఎన్టీఆర్‌ను తలపించారు.

తెలుగు సినిమా ప్రేక్షకులకు అంతగా అలవాటు లేని ఈ విధమైన క్లిష్టతతో కూడుకున్న కథను తెరకెక్కించి ప్రేక్షకుల ఆదరణ పొందడంలో సంగీతం శ్రీనివాసరావు ప్రతిభ కనిపిస్తుంది. అమ్రీష్‌ పురి విలనిజం, రాజనర్తకిగా సిల్క్‌ స్మిత హొయలు, సైన్‌టిస్ట్‌గా టీను ఆనంద్‌.. నటనా పరంగా ప్రధాన బలాలు.

balayya
బాలయ్య

సీక్వెల్​

ఆదిత్య 369 సీక్వెల్‌గా 'ఆదిత్య 999'ను తెరకెక్కించాలనేది బాలయ్య డ్రీమ్​ ప్రాజెక్ట్​ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక్కడ మరో విశేషమేంటంటే.. ఈ సీక్వెల్‌కు బాలకృష్ణనే స్వయంగా దర్శకత్వం వహించబోతున్నాడని టాక్​. ఇది ఎంత వరకు వాస్తవమన్నది ఇప్పుడే కచ్చితంగా తెలియనప్పటికీ బాలయ్యకు తన తండ్రి ఎన్టీఆర్‌లా మెగాఫోన్‌ చేతబట్టాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందన్నది వాస్తవం.

balayya
బాలయ్య
balayya
బాలయ్య

ఇది చూడండి: ప్రభాస్​-నాగ్​ అశ్విన్​ సినిమా కొత్త కబురు నేడే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.