ETV Bharat / sitara

కట్టప్ప పాత్రను సంజయ్‌దత్‌ చేయాల్సింది.. కానీ! - సంజయ్ దత్ వార్తలు

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఇందులో బాహుబలితో పాటు కట్టప్ప పాత్రకు మంచి పేరొచ్చింది. అయితే ఈ పాత్ర కోసం మొదట చిత్రబృందం సంజయ్​దత్​ను అనుకుందట.

కట్టప్ప పాత్రను సంజయ్‌దత్‌ చేయాల్సింది.. కానీ!

author img

By

Published : Jul 16, 2020, 8:00 PM IST

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు 'బాహుబలి' సినిమా ఎనలేని పేరు తెచ్చిందన్నది వాస్తవం. అయితే ఈ సినిమాలో బాహుబలితో పాటు మరో కీలక పాత్ర కట్టప్ప. 'బాహుబలి' మొదటి భాగంలో కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయమై రెండో సినిమా తెరపైకి వచ్చే వరకు ఓ పెద్ద చర్చే నడిచింది. అయితే తొలుత కట్టప్ప పాత్రకు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ను అనుకున్నారట. కానీ అప్పటికే సంజయ్‌ జైలులో ఉండటం చేత ఆ పాత్రని కోల్పోయారట.

రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా రూపొందించిన ఈ చిత్రంలో తొలుత అనుకున్న పాత్రలకు తరువాత తెరపైకి వచ్చే సరికి చాలా మార్పులు చోటుకున్నాయి. శివగామి పాత్రకు శ్రీదేవి, దేవసేన పాత్రకు నయనతారను అనుకున్నారట. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. విజయేంద్ర ప్రసాద్‌ అందించిన 'బాహుబలి' కథకు మొదట అనుకున్నది ఒకరిని అయితే తెరపైకి వచ్చేసరికి వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకవేళ సంజయ్‌దత్ కట్టప్ప పాత్ర పోషించించి ఉంటే ఎలా ఉండేదో..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.