ETV Bharat / sitara

బాహుబలి సినిమా ఈ శుక్రవారమే విడుదల! - హిందీవర్షన్‌ 'బాహుబలి- బిగినింగ్‌' రీరిలీజ్​

ఎస్​ఎస్​ రాజమౌళి చెక్కిన అద్భుత చిత్రం 'బాహుబలి' శుక్రవారం(నవంబర్​ 6) రిలీజ్​కు సిద్ధమైంది. అదేంటి? ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడమేంటని అనుకుంటున్నారా? అయితే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.

bahubali movie is going to rerelease tomorrow in theatres
బాహుబలి సినిమా రేపే విడుదల!
author img

By

Published : Nov 5, 2020, 8:50 AM IST

లాక్‌డౌన్‌తో మూతపడిన థియేటర్లను తెరుచుకోవచ్చని గత నెలలోనే కేంద్రం ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి నియమ నిబంధనలూ విడుదల చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మల్టీఫ్లెక్సులు తెరచుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సింగిల్‌ స్క్రీన్ల్‌తోనే థియేటర్లు నడుస్తున్నాయి.

గురువారం నుంచి మహారాష్ట్రలో, నవంబరు 10 నుంచి తమిళనాడులోనూ సినిమా హాళ్లు తెరవనున్నారు. అయితే వీటిల్లో ఆడించడానికి కొత్త సినిమాలు లేవు. ఫలితంగా గతంలో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలనే మళ్లీ ప్రదర్శించనున్నారు.

ఇలా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన బాహుబలి చిత్రాన్ని రీ-రిలీజ్‌ చేస్తున్నట్లు కరణ్‌జోహర్‌ ప్రకటించారు. హిందీవర్షన్‌ 'బాహుబలి- బిగినింగ్‌'ను ఈ శుక్రవారం, 'బాహుబలి-కన్‌క్లూజన్‌'ను ఈ నెల 13న విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వెండితెర మీద మరోసారి బాహుబలిని చూడటానికి ప్రేక్షకులు వస్తారని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి:సినిమాల్లోకి సైఫ్ అలీఖాన్​​ వారసుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.