ETV Bharat / sitara

డ్రగ్స్ కేసులో ఆర్యన్​ ఖాన్​కు బెయిల్ నిరాకరణ - మున్​మున్ దమేచా బెయిల్ నిరాకరణ

డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్​ పెట్టుకున్న బెయిల్(Aryan Khan Bail) దరఖాస్తును తిరస్కరించింది ముంబయి ప్రత్యేక న్యాయస్థానం. ఆర్యన్​తో పాటు అర్బాజ్, మూన్​మూన్ ధమేచాల బెయిల్ పిటిషన్​ను కొట్టివేసింది.

Aryan
ఆర్యన్
author img

By

Published : Oct 20, 2021, 3:00 PM IST

Updated : Oct 20, 2021, 4:51 PM IST

ముంబయిలోని క్రూయిజ్​ నౌక డ్రగ్స్‌ కేసులో ఇటీవల అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ (Srk Son Bail) తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. బెయిల్(Aryan Khan Bail) కోసం అతడు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది ముంబయి ప్రత్యేక న్యాయస్థానం.

అక్టోబర్ 14న ఆర్యన్‌(Aryan Khan Bail), అర్బాజ్, మూన్‌మూన్‌ ధామేచాల బెయిల్‌ పిటిషన్‌పై ఎన్​సీబీ, డిఫెన్స్‌ న్యాయవాదుల మధ్య కోర్టులో సుదీర్ఘవాదనలు కొనసాగాయి. ఆర్యన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్​సీబీ వాదించింది. అనంతరం బెయిల్‌పై తీర్పును జడ్జి వీవీ పాటిల్‌ ఈ నెల 20కు వాయిదా వేశారు. బుధవారం మరోసారి ఈ విషయంపై విచారణ చేపట్టిన కోర్టు వారికి బెయిల్(Aryan Khan Bail)​ను నిరాకరించింది.

కొద్దిరోజులగా ఆర్యన్ ఖాన్​ తరచూ డ్రగ్స్ సేవిస్తున్నాడని కోర్టుకు తెలిపింది ఎన్​సీబీ. కొందరు ఏజెంట్లతోనూ ఇతడికి పరిచయాలున్నట్లు పిటిషన్​లో పేర్కొంది.

ప్రస్తుతం ఆర్యన్, అర్బాజ్ ముంబయిలోని ఆర్థర్​ రోడ్​ జైల్లో ఉండగా, ధమేచా.. బైకుల్లా మహిళల జైలులో ఉంది.

హైకోర్డుకు ఆర్యన్

బెయిల్ విషయంలో ముంబయి ప్రత్యేక న్యాయస్థానంలో ఆర్యన్​ ఖాన్​కు చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ బాంబే హైకోర్టుకు పిటిషన్​ దాఖలు చేశారు ఆర్యన్ తరఫున న్యాయవాది. త్వరలోనే ఈ విషయంపై విచారణ చేపట్టనుంది కోర్టు.

ఇవీ చూడండి: ఆర్యన్​ విడుదలయ్యేవరకు 'మన్నత్'​లో స్వీట్లు బంద్​!

Last Updated : Oct 20, 2021, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.