Malaika Arora Arjun Kapoor trending vedio: బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్-మలైకా అరోరా మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లారు. వెకేషన్లో సరదాగా గడుపుతున్న పలు ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది ఈ జంట. ఈ క్రమంలో మలైకాతో ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియోను షేర్ చేశాడు అర్జున్ కపూర్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ వీడియోలో ఇద్దరు స్విమ్మింగ్ పూల్‌లో సైక్లింగ్ చేస్తున్నారు. బ్యాగ్రౌండ్లో బాద్షా వైరల్ ట్రాక్ 'జుగ్ను' ఆద్యంతం ఆకట్టుకుంటోంది. 'ట్రైనీ కంటే గర్ల్‌ఫ్రెండ్ టఫ్ టాస్క్మేకర్ అయితే..' అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ఉంది. వీడియో చివర్లో మలైకాను అర్జున్ కపూర్ సైకిల్ మీద నుంచి తోసేస్తాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
అర్జున్ కపూర్ షేర్ చేసిన వీడియో కంటే ముందే మలైకా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో అర్జున్ కపూర్ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కనిపిస్తాడు. 'మ్యాన్ ఆన్ వర్క్, డు నాట్ డిస్టర్బ్' అనే క్యాప్షన్‌ను ఈ వీడియోకు జత చేసింది మలైకా అరోరా.
ఇదీ చదవండి:అక్కడ 1,000 మల్టీప్లెక్స్‌ల్లో 'ఆర్‌ఆర్‌ఆర్' రిలీజ్