ETV Bharat / sitara

Arjun Kapoor: ప్రేయసి కోసం రూ.23 కోట్లతో విల్లా - మలైకా ఇంటికి దగ్గరగా అర్జున్ కపూర్ విల్లా

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్(Arjun Kapoor) ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో రూ.23 కోట్లతో విల్లా కొనుగోలు చేశాడట. తన ప్రేయసి మలైకా అరోరా ఇంటికి అతి సమీపంలో ఈ విల్లా ఉంటుందట.

arjun, malika
అర్జున్, మలైకా
author img

By

Published : May 31, 2021, 1:20 PM IST

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ అర్జున్‌ కపూర్‌-మలైకా అరోరా మరోసారి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచారు. తన ప్రేయసి మలైకాకు అత్యంత చేరువలో ఉండాలనే ఉద్దేశంతో అర్జున్‌ (Arjun Kapoor) బాంద్రాలో ఓ సరికొత్త విల్లాను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం తన సోదరితో కలిసి ముంబయిలోని ఓ ప్రాంతంలో నివాసముంటున్న అర్జున్‌ తాజాగా బాంద్రాలో ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరూ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలో గల ఈ విల్లా కోసం ఈ హీరో సుమారు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అలాగే, ఆయన కొనుగోలు చేసిన ఈ ఇల్లు.. మలైకా (Malaika Arora) ఉంటున్న ఇంటికి అతి తక్కువ దూరంలోనే ఉంటుందట.

arjun, malika
అర్జున్, మలైక

అర్జున్‌ కపూర్‌-మలైకా ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. పెళ్లి కూడా చేసుకుందామని భావిస్తున్నారట. వయసు పరంగా చూసుకుంటే అర్జున్‌ కంటే మలైకా 12 సంవత్సరాలు పెద్దది. దీంతో వీరిద్దరి రిలేషన్‌ గురించి వార్తలు బయటకు వచ్చిన తరుణంలో అందరూ వీరి వయసు గురించే మాట్లాడుకున్నారు. దాంతో తమకు సంబంధం లేదని.. ప్రేమానుబంధాలు ముఖ్యమని ఎన్నో సందర్భాల్లో ఈ జంట చెప్పింది కూడా.

ఇవీ చూడండి: మలైకా అంటే అందుకే ఇష్టం: అర్జున్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.