మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న కొత్త చిత్రం 'ఆరట్టు'. ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అతిథి పాత్రలో నటించనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాకు ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు.
అంతకుముందు మోహన్‌లాల్ నటించిన 'మన్యం పులి' సినిమాకు ఉన్నికృష్ణన్ కథ అందించారు. ఈ సినిమా అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. దీంతో మళ్లీ వీరిద్దరి కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదీ చూడండి: 'జార్జ్‌కుట్టి పాత్రలో నటించడం అంత ఈజీ కాదు'