ETV Bharat / sitara

ఏఆర్ రెహ్మన్​నూ వదలని మూవీ మాఫియా! - ఏఆర్ రెహ్మన్ నెపోటిజం

బాలీవుడ్​లో బంధుప్రీతి అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాము కూడా ఇండస్ట్రీ మాఫియా వల్ల ఇబ్బందిపడ్డామని పలువులు తమ ఆవేదనను వెల్లడిస్తున్నారు. తాజాగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మన్ కూడా ఈ సమస్యకు ప్రభావితుడయ్యానని తెలిపారు.

ఏఆర్ రెహ్మన్​నూ వదలని మూవీ మాఫియా!
ఏఆర్ రెహ్మన్​నూ వదలని మూవీ మాఫియా!
author img

By

Published : Jul 25, 2020, 8:01 PM IST

బాలీవుడ్​లో బంధుప్రీతి అంశం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. సినీ ఇండస్ట్రీలో మాఫియాపై చాలామంది విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మన్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. తానూ ఈ మాఫియా బారినపడినట్లు వెల్లడించారు రెహ్మన్.

"కొందరు తనపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొన్ని అవకాశాలు నా వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. నేను తొందరగా పాటలు సమకూర్చనని.. నా వద్దకు రావొద్దని తప్పుడు ప్రచారం చేస్తున్నారు."

-రెహ్మన్, సంగీత దర్శకుడు

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ హీరోగా తెరకెక్కిన చివరి చిత్రం 'దిల్ బెచారా'. ఈ సినిమాకు ముఖేశ్ ఛబ్రా దర్శకత్వం వహించారు. రెహ్మన్ సంగీత స్వరాలు సమకూర్చారు. అయితే ముఖేశ్​కు కూడా కొందరు ఈ సినిమా కోసం రెహ్మన్​కు తీసుకోద్దని కోరారట. కానీ ఈ చిత్రానికి రెహ్మన్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని అలరించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.