ETV Bharat / sitara

'నిశ్శబ్దం' ట్రైలర్​: ఆ ఇంట్లో ఏం జరిగింది? - నిశ్శబ్దం అమెజాన్​ ప్రైమ్​లో

దివ్యాంగురాలిగా స్టార్​ హీరోయిన్​ అనుష్క నటిస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. అక్టోబరు 2న అమెజాన్​ ప్రైమ్​లో విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను టాలీవుడ్​ యువ కథానాయకుడు రానా సోషల్​మీడియా ద్వారా రిలీజ్​ చేశాడు.

Anushka Shetty's Nishabdham Trailer out now
'నిశ్శబ్దం' ట్రైలర్​: ఆ ఇంట్లో ఏం జరిగింది?
author img

By

Published : Sep 21, 2020, 2:19 PM IST

అనుష్క, మాధవన్‌, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'నిశ్శబ్దం'. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడం వల్ల అమెజాన్‌ ప్రైమ్​ వేదికగా అక్టోబరు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా యువ నటుడు రానా ఈ చిత్ర ట్రైలర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అనుష్క ఇందులో దివ్యాంగురాలి పాత్ర పోషిస్తోంది. సోనాలి అనే యువతి కనిపించకుండా పోవటానికి కారణం ఏంటి? సాక్షి(అనుష్క), ఆంటోని(మాధవన్‌)లు ఎవరు? వారికి సోనాలికీ సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మైఖేల్‌ మాడిసన్‌, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.