ETV Bharat / sitara

'సర్కారు వారి పాట'లో బ్యాంకు మేనేజర్​గా అనుష్క! - అనుష్క వార్తలు

సూపర్​స్టార్​ మహేశ్​బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'లో స్టార్​ హీరోయిన్​ అనుష్క నటించనుందని టాలీవుడ్​లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. దర్శకుడు పరశురామ్​ పేరుతో ఉన్న ట్వీట్​ వైరల్​గా మారింది. అయితే చివరికి అది నకిలీ ఖాతా అని తేలడం వల్ల అది ఒక పుకారు మాత్రమే అని తెలిసింది.

Anushka Shetty To Play Key Role In Mahesh Babu's Sarkaru Vaari Paata?
'సర్కారు వారి పాట'లో బ్యాంకు మేనేజర్​గా అనుష్క!
author img

By

Published : Nov 22, 2020, 7:56 AM IST

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం 'సర్కారువారి పాట'. ఈ సినిమాకు పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలూ చేసుకుంది. ఇందులో మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటిస్తోంది. ఇదంతా ఇలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి టాలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్‌ బ్యాంకు మేనేజర్‌గా అనుష్కశెట్టి కనిపించనుందన్నది దాని సారాంశం. అయితే.. దీనికి సంబంధించి చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. చివరికి తేలిందేంటంటే.. ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదట.

Anushka Shetty To Play Key Role In Mahesh Babu's Sarkaru Vaari Paata?
వైరల్​గా మారిన ట్వీట్​

ఎవరో ఓ అజ్ఞాత వ్యక్తి ట్విట్టర్‌లో డైరెక్టర్‌ పరుశురామ్‌ పేరుతో ఖాతా తెరిచారు. "సర్కారువారి పాట'లో అనుష్క ఓ పాత్ర పోషిస్తుండటం సంతోషంగా ఉంది. ఆమె ఈ సినిమాలో అదరగొడుతుందన్న నమ్మకం ఉంది. షూటింగ్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం" అని అందులో పోస్టు చేశాడు. తీరా అది నకిలీ ఖాతా అని తెలిసే సరికి ఈ వార్త కూడా నకిలీదేనని స్పష్టమైంది. ఇదిలా ఉండగా.. 2021 జనవరి మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.