ETV Bharat / sitara

సినిమాలకు అనుష్క గుడ్​బై చెప్పేసినట్లేనా? - అనుష్క శర్మ మూవీ అప్​డేట్స్​

అద్భుతమైన కథలను ఎంచుకోవటమే నటిగా, నిర్మాతగా తన లక్ష్యమంటోంది బాలీవుడ్​ భామ అనుష్క శర్మ. ఇకపై ఉత్తమ కథాంశాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టనున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. 2018లో వచ్చిన జీరో సినిమా తర్వాత హీరోయిన్​గా ఏ సినిమాలోనూ నటించలేదు.

Anushka: Always backed disruptive content in my career
'నా కెరీర్​లో విలక్షణమైన కథలనే ఎంచుకున్నాను'
author img

By

Published : Mar 13, 2020, 8:02 PM IST

పది సంవత్సరాల సినీ ప్రస్థానంలో తానెప్పుడూ ఉత్తమ కథలనే ఎంచుకున్నట్లు చెప్పింది బాలీవుడ్​ నటి అనుష్క శర్మ. వివిధ రకాల జోనర్​లలో నటించడమే కాకుండా పలు సినిమాలనూ నిర్మించినట్లు తెలిపింది.

ఆమె నిర్మాణంలో రూపొందిన 'ఎన్​హెచ్​ 10' సినిమా విడుదలై నేటితో 5 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను పంచుకుందీ నటి.

" 'ఎన్​హెచ్​ 10' చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచన నాదే. ప్రజలను అలరించటానికి ఇదీ ఒక మార్గమే. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని సినిమాతో అందిచాలన్నదే నా లక్ష్యం. నటిగా నా కెరీర్ మొత్తంలో విలక్షణమైన కథలకే మద్దతిచ్చాను. 'ఎన్​హెచ్​ 10' చిత్రం నా వద్దకు వచ్చినప్పుడు, నిర్మాతగా ప్రేక్షకులకు అందిచాలన్నది నాకు అనిపించింది".

- అనుష్క శర్మ, కథానాయిక

Anushka: Always backed disruptive content in my career
అనుష్క శర్మ

అనుష్క 2018లో వరుణ్ ధావన్‌తో 'సుయి ధాగా', షారుఖ్ ఖాన్‌తో 'జీరో' చిత్రాలలో నటించింది. అపట్నుంచి ఎలాంటి ప్రాజెక్టులకు అంగీకరించలేనట్లు సమాచారం. తాజాగా విడుదలైన 'అంగ్రేజీ మీడియం' సినిమాలో చిన్నపాటి అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సొంత నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్​ బ్యానర్​పై 'బుల్బుల్' పేరుతో ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇదీ చూడండి.. అనుష్కకు ఆ విషయం అప్పుడే చెప్పా: రాఘవేంద్రరావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.