ETV Bharat / sitara

ఆ రెండింటికీ ఒకేలా కష్టపడతా: అనూప్

పని అనేది తనకు ఓ బాధ్యత అని మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అన్నారు. 'మంచిరోజులు వచ్చాయి' చిత్రానికి సంగీతం అందించడం గురించి చెప్పారు.

anup rubens
అనూప్ రూబెన్స్
author img

By

Published : Oct 29, 2021, 8:19 AM IST

"ఒక పాట ప్రేక్షకుల్ని థియేటర్‌ వరకు తీసుకొస్తోందంటే అంతకంటే ఆనందం ఏముంటుంది? ఒక సంగీత దర్శకుడిగా ఆ విషయంలో చాలా సంతోషిస్తాను. పాటలవల్లే కొన్ని చిన్న సినిమాలకు స్టార్‌ కథానాయకుల చిత్రాల స్థాయిలో ప్రారంభ వసూళ్లు వచ్చాయి" అని సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ అన్నారు. ఆయన ఇటీవల 'మంచి రోజులు వచ్చాయి' సినిమాకు స్వరాలు సమకూర్చారు. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్‌ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం అనూప్‌ హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఆ విషయాలివీ..

*మారుతి సినిమాలంటే నాకు ఇష్టం. ఆయన కథలు సానుకూల ధృక్పథంతో సాగుతాయి. చిన్న సందేశంతోపాటు, మంచి వినోదం ఉంటుంది. ఆయనతో పనిచేయాలని చాలా రోజుల నుంచి ఉండేది. అనుకోకుండా లాక్‌డౌన్‌ సమయంలో ఆయన్నుంచే ఫోన్‌ కాల్‌ వచ్చింది. చిన్న సినిమా చేయాలనుకుంటున్నా అని చెప్పారు. లాక్​డౌన్‌ తొలగించిన మరుసటి రోజు నుంచే చిత్రీకరణకు వెళతామని చెప్పారు. కథ వినిపించగానే కచ్చితంగా చేద్దామని చెప్పా. ఇంటి నుంచే పనిచేశా. ఫోన్‌లోనే పాటలన్నీ పంపా. రెండు మూడువారాల్లోనే పాటలన్నీ సిద్ధమయ్యాయి. లాక్‌డౌన్‌ తొలగించిన మరుసటి రోజు నుంచే ప్రారంభించి, 30 రోజుల్లోనే సినిమా పూర్తి చేశారు.

*ఒక కాలనీలో జరిగే కథ ఇది. సాధారణంగా ఒకొక్కళ్లకు ఒక్కో భయం ఉంటుంది. ఆ భయం గురించే ఈ కథ. చాలా సహజమైన సంఘటనలతో సాగుతుంది. ఏ విషయాన్నైనా వినోదాత్మకంగా చెప్పడం మారుతి ప్రత్యేకత. ఇందులో మనలోని ఉండే భయాల్ని వినోదాత్మకంగా తెరపై ఆవిష్కరించారు. ఐదు పాటలుంటాయి. సోసోగా పాటకి మూడు బాణీలు ఇచ్చాం. అందులో సోసో నాకు బాగా నచ్చింది. దాన్నే ఎంపిక చేశారు. నేను, దర్శకుడు, గీత రచయితలు కేకే, అనంతశ్రీరామ్‌, కాసర్లశ్యామ్‌.. మేమంతా ఫోన్‌లోనే మాట్లాడుకుని పనిచేశాం. ఒకే సమయంలో భిన్నమైన భావోద్వేగాలు పండుతుంటాయి. అందుకు తగ్గట్టుగా సంగీతం ఇవ్వడం కొత్త అనుభవం. ఈ సినిమా నేను చేయడానికి మరో కారణం నిర్మాత ఎస్‌.కె.ఎన్‌. ఆయనే నా పేరును మారుతికి సూచించారు.

* నాకు వస్తున్న అవకాశాల్ని బట్టే నా ప్రయాణం కొనసాగుతోంది. నిరంతరం పనిచేస్తూనే ఉన్నా. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా రెండింటికీ ఒకేలా కష్టపడతా. పని అనేది నాకొక బాధ్యత. ఇక అందులో చిన్న, పెద్ద అనేది చూడను. ప్రస్తుతం నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న 'బంగార్రాజు'కు పనిచేస్తున్నా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.