కమల్ హాసన్‌తో అనుష్క నటించబోతుందా? అంటే అవునని అంటున్నాయి సినీ వర్గాలు. గతంలో కమల్ హీరోగా గౌతమ్ మేనన్ 'వేట్టైయాడు విళయాడు' తెరకెక్కించి మంచి విజయం అందుకున్నాడు. తెలుగులో 'రాఘవన్' పేరుతో విడుదలైంది. జ్యోతిక నాయిక. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడట గౌతమ్.
సీక్వెల్‌లోనూ కమలే హీరోగా చేస్తున్నాడని తెలుస్తోంది. కథానాయికగా అనుష్కను తీసుకునే ఆలోచన చేస్తున్నారని కోలీవుడ్ టాక్. ఇప్పటికే దర్శకుడు అనుష్కను సంప్రదించాడని, స్వీటీకి కథ నచ్చడం వల్ల ఓకే చెప్పిందని వినికిడి. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది. మరి కమల్, అనుష్క జోడీ ఎలా అలరిస్తుందో చూడాలి.