ETV Bharat / sitara

'గర్భిణీ'గా అనసూయ.. జూనియర్​ సమంతపై విమర్శలు - పునీత్​ రాజ్​కుమార్​ యువరత్న సినిమా ప్రోమో విడుదల

కొత్త సినిమా కబుర్లు మీ ముందుకొచ్చేశాయి. కన్నడ స్టార్ హీరో​ పునీత్​ రాజ్​కుమార్​ సినిమా తెలుగులోకి రాబోతుంది. నటి అనసూయ నటించిన కొత్త సినిమా ఫస్ట్​లుక్​, రాఘవేంద్ర వర్మ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'బొంభాట్‌' ట్రైలర్​ విడుదలయ్యాయి. జూనియర్​ సమంతగా పేరు గాంచిన నటి ఆత్మికను నెటిజన్లు విమరిస్తున్నారు. అవన్నీ మీకోసం..

annasuya
గర్భిణిగా అనసూయ
author img

By

Published : Nov 27, 2020, 7:37 PM IST

శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తొలిసారిగా తెలుగులో తన సినిమాను విడుదల చేయబోతున్నారు. 'యువరత్న' పేరుతో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. సంతోష్ అనాంద్రం దర్శకత్వం వహించారు. ఎస్‌ఎస్. తమన్​ స్వరాలు సమకూర్చారు. సయేషా సైగల్ హీరోయిన్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

యాంకర్​, నటి అనసూయ 'థ్యాంక్యూ బ్రదర్' సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​ లుక్​ శుక్రవారం.. హీరో సాయి ధరమ్​ తేజ్​ విడుదల చేశారు. ఇందులో గర్భిణీగా కనిపించిన అనసూయ ​లుక్​ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు.

thanku brother
థ్యాంక్యూ బ్రదర్

రాఘవేంద్ర వర్మ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'బొంభాట్‌'. సుశాంత్‌, చాందిని చౌదరి, సిమ్రాన్‌ చౌదరి ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ విడుదలైంది. సినీప్రియులను ఆకట్టుకునేలా ఉందీ ప్రచార చిత్రం. ట్రయాంగిల్‌ లవ్​స్టోరీ కథాంశంతో తెరకెక్కిందీ సినిమా.

తన సందేహాన్ని సోషల్‌మీడియా వేదికగా బయటపెట్టి.. నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది నటి ఆత్మిక(జూనియర్​ సమంత). కోలీవుడ్‌లో తెరకెక్కిన 'మీసాయి మురుక్కు' చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ విజయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆత్మిక ట్విటర్‌ వేదికగా.. 'సినిమా పోస్టర్‌పై ఆ సినిమాలో నటిస్తున్న కథానాయిక పేరును ఎందుకు ఉంచరు? ఈ విషయం నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది' అని తన సందేహాన్ని బహిర్గతం చేసింది. దీంతో పలువురు నెటిజన్లు ఆమె ట్వీట్‌ను సమర్థించగా.. మరికొంత మంది నెగెటివ్‌ కామెంట్లు పెడుతున్నారు.

samantha
ఆత్మిక

ఇదీచూడండి : సినిమా స్టైల్​లో శ్రీదేవి-బోనీకపూర్​ ప్రేమాయణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.