రియా చక్రవర్తి వల్లే తన కుమారుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి మంగళవారం పోలీసు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నటి అంకితా లోఖండే.. 'ట్రూత్ విన్స్' అని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇది బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. 'నిజం గెలుస్తుంది' అనే అర్థంతో పెట్టిందా? లేదా మరేదైనా కారణముందా అని అనుకుంటున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
రియా చక్రవర్తి కుటుంబ సభ్యులతో పాటు మరో ఆరుగురు వ్యక్తులు సుశాంత్ మరణానికి కారణమని పట్నా జోన్ ఇన్స్పెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో సుశాంత్ తండ్రి పేర్కొన్నారు. తన కుమారుడితో స్నేహం చేసి, ఆమె కెరీర్ను అభివృద్ధి చేసుకుందని రియాపై ఆరోపణలు చేశారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన రియా
తనపై పట్నాలో నమోదైన కేసును ముంబయికి బదిలీ చేయాలని నటి రియా చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె తరపు న్యాయవాది సతీశ్ మనేషిండే ఈ విషయాన్ని చెప్పారు.