సినీ నటి అమీ జాక్సన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. గర్భంతో ఉన్నప్పుడు బేబి బంప్ ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ నటి బాబుకు జన్మనిచ్చినట్లు తెలిపింది.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో అమీ జాక్సన్ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. అంతేకాదు పెళ్లి కాకుండానే తల్లయింది.
'మదరాసు పట్టణం' సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది అమీ జాక్సన్. తెలుగులో 'ఎవడు','అభినేత్రి' సినిమాల్లో నటించింది. గతేడాది శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన '2.O'లో వెన్నెల అనే రోబో పాత్రలో కనిపించి మెప్పించింది.
ఇవీ చూడండి.. 'మ్యాడ్ హౌజ్' పేరుతో మెగా హీరోయిన్ వెబ్‌సిరీస్