బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(amitabh bachchan) నటించిన 'కాలాపత్తర్'(Kaala Patthar) సినిమా విడుదలై 42 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన నటనా జీవితంలోని తొలిరోజులను అమితాబ్ గుర్తు చేసుకున్నారు. అంతేగాక ఈ సినిమాలోని పాత్ర మాదిరే.. తాను కూడా పరిశ్రమలోకి రాకముందు బొగ్గు గనుల్లో పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు.
బలమైన కథ..
బొగ్గుగని ప్రమాదం(coal mine accident) ఆధారంగా తెరకెక్కిన 'కాలాపత్తర్' చిత్రానికి సలీం-జావేద్ ద్వయం కథను అందించారు. 1975లో ఝార్ఖండ్ చస్నాల మైనింగ్ విపత్తు(chasnala mining disaster)కారణంగా.. 375 మంది బాలలు మృతిచెందారు. గనిలో పనిచేసే మాజీ నావికాదళ కెప్టెన్‌గా అమితాబ్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అమితాబ్ సహోద్యోగి మంగళ్ పాత్రలో శత్రుఘ్న సిన్హా(shatrughan sinha) నటించారు. గని ప్రమాదానికి కారణమైన అధికారి పాత్రలో శశికపూర్ నటన ఆకట్టుకుంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే 'కాలాపత్తర్' ఎప్పటికీ ప్రత్యేకమేనని అమితాబ్ తెలిపారు. ఈ మేరకు సినిమాలోని కొన్ని స్టిల్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
"నేను సినిమాల్లోకి రాకముందు కోల్‌కతా బొగ్గు గనుల విభాగంలో పనిచేసేవాడిని. నాటి వ్యక్తిగత అనుభవాలు ఈ చిత్రంలో నటించే సమయంలో ఉపయోగపడ్డాయి. కాలాపత్తర్ సినిమా షూటింగ్ ఎక్కువగా ధన్‌బాద్, అసన్సోల్ బొగ్గు గనుల్లో జరిగింది."
-అమితాబ్‌బచ్చన్
42ఏళ్ల క్రితం(1979లో) యశ్‌చోప్రా(yash chopra) నిర్మించిన 'కాలాపత్తర్' సినిమా సరిగ్గా ఇదేరోజున విడుదలై భారతీయ చలన చిత్రపరిశ్రమలో క్లాసిక్‌గా నిలిచిపోయింది. 'ఏక్ రాస్తా హై జిందగీ', 'బాహో మే తేరి' వంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు.. రాఖీ, పర్వీన్ బాబీ, నీతూసింగ్, ప్రేమ్ చోప్రా, మాక్ మోహన్‌లు తమదైన శైలిలో నటించారు.
ఇవీ చదవండి: