బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తమిళంలో తొలిసారిగా 'ఉయరత్న మణిదన్' సినిమాలో నటిస్తున్నాడు. హిందీలోనూ విడుదల కానుందీ చిత్రం. టైటిల్‌ను 'తేరా యార్ హూన్ మైన్'గా చిత్రబృందం నిర్ణయించింది.
ఎస్.జె.సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా ముంబయి పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. అమితాబ్‌కు జోడిగా రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ చిత్రానికి తమిళవనం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన బిగ్‌బి ఫొటోలు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదే కాకుండా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న 'బ్రహ్మాస్త్ర'లోనూ నటిస్తున్నాడు అమితాబ్. సినిమాలోని ఇతర పాత్రల్లో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున కనిపించనున్నారు.
ఇవీ చదవండి: