బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా క్రికెట్‌కు వీరాభిమానే. ఆటపై అప్పుడప్పుడు తన అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు మరోసారి తన హాస్య చతురతను బయటపెట్టారు.
![Amitabh Bachchan suggests creating Indian cricketers' daughters team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10241585_yv.jpg)
భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులకు ఈ సోమవారం(జనవరి 11) ఆడపిల్ల పుట్టింది. ఆ వెంటనే కుమార్తెలు ఉన్న భారత క్రికెటర్ల జాబితా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీనిపై తనదైన శైలిలో స్పందించారు అమితాబ్. "భారత క్రికెటర్లలో అందరికీ దాదాపుగా కూతుర్లే ఉన్నారు. దీంతో వారే సొంతంగా ఓ మహిళా క్రికెట్ జట్టును తయారు చేసుకోవచ్చు" అని సరదాగా ట్వీట్ చేశారు.
-
T 3782 - An input from Ef laksh ~
— Amitabh Bachchan (@SrBachchan) January 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
"... and Dhoni also has daughter .. will she be Captain ? 🙏'' pic.twitter.com/KubpvdOzjt
">T 3782 - An input from Ef laksh ~
— Amitabh Bachchan (@SrBachchan) January 13, 2021
"... and Dhoni also has daughter .. will she be Captain ? 🙏'' pic.twitter.com/KubpvdOzjtT 3782 - An input from Ef laksh ~
— Amitabh Bachchan (@SrBachchan) January 13, 2021
"... and Dhoni also has daughter .. will she be Captain ? 🙏'' pic.twitter.com/KubpvdOzjt
తన అభిమానులు కూడా అదే అభిప్రాయపడుతున్నారని చెప్పారు బిగ్‌బీ. అయితే వారు పంచుకునే జాబితాలో భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని మరచిపోయిన విషయాన్ని పట్టుకున్నారు అమితాబ్. "ధోనీకి కూడా కూతురు ఉంది. ఆమె కెప్టెన్ అవుతుందా?" అని ట్విట్టర్లో రాసుకొచ్చారు.
![Amitabh Bachchan suggests creating Indian cricketers' daughters team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10241585_yv1.jpg)
ఇదీ చూడండి: భారత కెప్టెన్ కోహ్లీ దంపతులకు ఆడపిల్ల