విజయ్ రామ్, శివ్‌శక్తి జంటగా నటించిన చిత్రం 'అమరం అఖిలం ప్రేమ'. జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తండ్రి, కూతురు మధ్య సాగే కథ ఇది. పాఠశాల రోజుల్లో ఎవరో ప్రేమ లేఖ ఇస్తే నాన్నకు చూపించాలనే మనస్తత్వం కలిగిన అమ్మాయి జీవితంలోకి ఓ అబ్బాయి వస్తే ఏం జరుగుతుంది? అనే ఆసక్తికర అంశంతో రూపొందినట్లు ఉంది ప్రచార చిత్రం చూస్తుంటే.
"నాన్నా ఓ కథ చెప్పు" అంటూ నాయిక పలికే సంభాషణతో ప్రారంభమయ్యే ట్రైలర్ ఆద్యంతం అలరిస్తోంది. ఏ విషయమైనా తండ్రితో చెప్పే అఖిల(శివ్‌శక్తి) ప్రేమ విషయాన్ని చెప్పలేకపోయిందా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. రధన్ నేపథ్య సంగీతం ఈ చక్కటి ప్రేమ కథని ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకునేలా చేస్తోంది. ఈ చిత్రం డిటిటల్ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో సెప్టెంబరు 18న విడుదల కాబోతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">