ETV Bharat / sitara

'విడాకుల సమయంలో నేనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా' - cinema latest news

విడాకులు.. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అత్యంత కఠినమైన మలుపు...! సర్వస్వం తానే అనుకున్న జీవిత భాగస్వామితో మధ్యలోనే విడిపోవడం.. తను లేకుండా మిగిలిన జీవితాన్ని గడిపే రోజులొస్తాయన్న ఆలోచన తీరని ఆవేదనను కలిగిస్తుంది. దీనికి తోడు విడాకులు తీసుకున్న స్త్రీలంటే సమాజం చూసే చిన్న చూపు వారిని మరింత అగాథంలోకి నెడుతుంది. సామాన్యులే కాదు సెలబ్రిటీలూ ఇలాంటి అవమానాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్నప్పుడు ఇలాంటి విమర్శలు, అవమానాలను చాలా ఎదుర్కొంది అమలాపాల్‌. చాలామంది నెటిజన్లు ఆమెను లక్ష్యంగా చేసుకుని ట్రోల్‌ చేశారు. అయినా వాటిని పట్టించుకోకుండా తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తోందీ ముద్దుగుమ్మ.

amala paul opens up about problems faced during her divorce
'విడాకుల సమయంలో నేనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా'
author img

By

Published : Mar 4, 2021, 11:30 AM IST

2010లో విడుదలైన మైనా (తమిళం) సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది అమలాపాల్‌. ఈ సినిమాలో అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్న ఆమె.. ఆ తర్వాత బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేసింది. లవ్‌ ఫెయిల్యూర్‌’, బెజవాడ’, నాయక్‌, ఇద్దరమ్మాయిలతో, ‘జెండాపై కపిరాజు’.. వంటి తెలుగు చిత్రాల్లోనూ నటించి ఇక్కడి ప్రేక్షకులకు బాగా చేరువైంది. 2019లో 'ఆమె' చిత్రంలో తన నటనకు గానూ మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక అమల వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2011లో 'దైవా తిరుమగల్‌' (తెలుగులో నాన్న) సినిమా షూటింగ్‌ సమయంలో ఆ చిత్ర దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌తో ప్రేమలో పడింది. మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరు.. 2014లో పెళ్లిపీటలెక్కారు. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

'మీరా'గా మెప్పించి!

వైవాహిక జీవితం మిగిల్చిన చేదు అనుభవాన్ని మర్చిపోతూ మళ్లీ సినిమాలతో బిజీగా మారిపోయింది అమల. విడాకుల తర్వాత తను నటించిన భాస్కర్‌ ఒరు రాస్కల్‌, రాట్‌సన్‌, కుట్టీ స్టోరీ చిత్రాలు తమిళ ప్రేక్షకులను బాగా మెప్పించాయి. ఈ క్రమంలో ఆమె తాజాగా 'పిట్టకథలు' అనే యాంథాలజీ చిత్రంలో నటించింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్‌లో 'మీరా' అనే ఓ గృహహింస బాధితురాలి పాత్రలో నటించింది అమల. ఇక ఈ చిత్ర కథ విషయానికొస్తే... పెళ్లి మీద సంప్రదాయ ఆలోచనలు కలిగిన మీరాను భర్త విశ్వామోహన్‌(జగపతిబాబు) నిత్యం అనుమానిస్తుంటాడు. వీరిద్దరి మధ్య వయసు తేడా కూడా ఉండడంతో మీరాతో ఎవరు చనువుగా ఉన్నా సహించలేకపోతుంటాడు. లైంగిక, శారీరక వేధింపులకు గురి చేస్తుంటాడు. వివాహ వ్యవస్థ మీద ఉన్న గౌరవంతో అన్నింటికీ తట్టుకుని నిలబడి అతనితోనే జీవితం కొనసాగిస్తుంటుంది మీరా. అయితే ఈ బంధం నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. చివరికి ఆమె భర్త హింస నుంచి ఎలా బయటపడిందన్నదే మీరా కథ. ఈ చిత్రంలో అమల అభినయానికి సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇక మీరా కథకు, తన నిజ జీవితానికి కొన్ని పోలికలు ఉండడంతో.. విడాకులు తీసుకున్న సమయంలో తను ఎదుర్కొన్న కొన్ని పరిస్థితుల గురించి ఇలా పంచుకుంది అమల.

నా కెరీర్‌ నాశనం అవుతుందన్నారు!

‘కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను విజయ్‌తో విడిపోవాల్సి వచ్చింది. పరస్పర అంగీకారంతోనే మేం విడాకులు తీసుకున్నాం. కానీ విజయ్‌ నుంచి విడాకులు తీసుకున్న సమయంలో నాకెవరూ అండగా నిలబడలేదు. పైగా నువ్వు ఒక అమ్మాయివని గుర్తు పెట్టుకో’ అంటూ భయపెట్టారు. సమాజం చిన్న చూపు చూస్తుందని, నా సినిమా కెరీర్‌ నాశనం అవుతుందని హెచ్చరించారు. నా సంతోషం, నా మానసిక సంఘర్షణ గురించి ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అయినప్పటికీ విడాకుల సమయంలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒంటరిగానే పోరాటం చేయాల్సి వచ్చింది’ అంటూ అప్పటి చేదు అనుభవాలను గుది గుచ్చిందీ అందాల తార.

ఇక విజయ్‌తో విడాకుల తర్వాత ఇంటా, బయటా పలు విమర్శలు ఎదుర్కొంది అమల. సోషల్‌ మీడియాలో కొందరు ఆమెను టార్గెట్‌ చేసుకుని ట్రోల్స్‌ చేశారు. అయితే వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొందీ కేరళ కుట్టి. వైవాహిక జీవితం మిగిల్చిన చేదు అనుభవాలను మర్చిపోతూ మళ్లీ తన కెరీర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె అధో ఆంధా పరవాయి పోలా’, ‘కాడవెర్‌’, ‘ఆడు జీవితం’, ‘పరాణ్ణు పరాణ్ణు పరాణ్ణు’ అనే సినిమాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి: సమంత త్వరలో సినిమాలకు దూరం కానుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.